ఏసీబీకి చిక్కిన మరో ఇద్దరు అవినీతి అధికారులు
ఏసీబీ వలకు మంచిర్యాల గ్రామ కార్యదర్శి వెంకటస్వామి, నిజామాబాద్ మున్సిపల్ రెవిన్యూ అధికారి శ్రీనివాసచారి చిక్కారు. ఇద్దరూ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

విధాత : ఏసీబీ(ACB) వలకు మరో ఇద్దరు అవినీతి అధికారులు చిక్కారు. మంచిర్యాల(Mancherial) జిల్లా హాజీపూర్ మండలం కర్నమామిడి గ్రామ కార్యదర్శి వెంకటస్వామి రూ. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరుకు లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేయగా..బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లంచం సొమ్ముతో ఏసీబీ అధికారులు వెంకట స్వామిని అరెస్టు చేశారు.
నిజామాబాద్(Nizamabad) మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) లో రెవిన్యూ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసచారి రూ.7500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నగరంలో పండ్ల దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారుడ. పర్మిషన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలో లంచం తీసుకుంటున్న క్రమంలో శ్రీనివాస చారిని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు.