Moles on Body | ‘నాభి’ చుట్టు పుట్టు మచ్చ.. ధన సంపాదనకు ఉండదిక లోటు..!
Moles on Body | ప్రతి మనిషి శరీరంపై పుట్టు మచ్చలు( Moles on Body ) ఉంటాయి. ఎక్కడంటే అక్కడ పుట్టు మచ్చలు( Moles ) దర్శనమిస్తుంటాయి. కానీ శరీరంలోని ప్రత్యేక అవయవాల వద్ద పుట్టు మచ్చలు ఉంటే.. ఆ వ్యక్తులకు శుభాలు( Good Luck ) వెల్లివిరుస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Moles on Body | పుట్టు మచ్చలు( Moles ) పుట్టుకతో వస్తాయి. వయసు పెరిగే కొద్ది కూడా అక్కడక్కడ పుట్టు మచ్చలు( Moles on Body ) ఉద్భవిస్తుంటాయి. అయితే ఈ పుట్టు మచ్చలకు కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలోని ఆయా అవయవ భాగాలపై ఉండే పుట్టు మచ్చల్లో కొన్నింటిని శుభం( Good Luck )గా భావిస్తారు. మరికొన్నింటిని అశుభంగా భావిస్తారు. మరి ఏయే అవయవాలపై పుట్టు మచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం..
ముక్కుపై పుట్టు మచ్చ..( Mole on Nose )
చాలా మందికి ముక్కుపై పుట్టు మచ్చ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జీవితంలో బాగా సంపాదిస్తారని అర్థం. వీరికి ఆర్థిక సమస్యలు కూడా తక్కువగా ఎదురవుతాయట. అరచేతిలో పుట్టు మచ్చ ఉన్న వారి జీవితం నిత్యం ఆనందమయంగా ఉంటుందట.
నుదుటిపై పుట్టు మచ్చ..( Mole on Forehead )
నుదుటిపై పుట్టు మచ్చలు ఉన్న వ్యక్తిని ఆ ఇంటికి శుభప్రదంగా భావిస్తారు. వీరు ధన కొరతను తమ జీవితంలో చూసి ఉండరట. అదృష్టం నడుచుకుంటూ వస్తుందట. గొంతు దగ్గర పుట్టు మచ్చలు ఉంటే కూడా శుభమట. గొంతు దగ్గర పుట్టు మచ్చలు ఉన్న స్త్రీలకు మగాళ్లను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందట.
నాభి చుట్టూ పుట్టుమచ్చ..( Mole on Navel )
నాభిపై లేదా నాభి చుట్టూ పుట్టు మచ్చ ఉంటే శుభ సంకేతంగా పరిగణిస్తారు. నాభి చుట్టు పుట్టు మచ్చ ఉన్న వారికి ధనాన్ని బాగా సంపాదిస్తారట. ఛాతీ మధ్యలో పుట్టు మచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులట. ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో మంచి గౌరవం లభిస్తుంది.
చెంపపై పుట్టు మచ్చ..( Mole on Cheek )
చెంపపై పుట్టు మచ్చ ఉండటం కూడా చాలా అదృష్టమట. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయట.