• Telugu News
  • /Devotional

Solar Eclipse | ఫిబ్ర‌వ‌రి 17న సూర్య‌గ్ర‌హ‌ణం.. ఈ నాలుగు రాశుల వారు జాగ్ర‌త్త ఉండాల్సిందే..!

Solar Eclipse | ఈ ఏడాదిలో తొలి సూర్య‌గ్ర‌హ‌ణం( Solar Eclipse ).. ఫిబ్ర‌వ‌రి 17న ఏర్ప‌డ‌బోతోంది. ఈ సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డిన త‌ర్వాత నాలుగు రాశుల( Zodiac Signs ) వారు జాగ్ర‌త్త ఉండాల్సిందే. ఈ నాలుగు రాశుల వారిని ఆర్థిక క‌ష్టాలు( Financial Problems ) వెంటాడ‌నున్నాయి. కుటుంబ క‌ల‌హాలు చోటు చేసుకోనున్నాయి. మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Reported by: raj | ఆధ్యాత్మికం | Feb 05, 2026, 7:49 am IST
Read Time: 4 mins
Solar Eclipse | ఫిబ్ర‌వ‌రి 17న సూర్య‌గ్ర‌హ‌ణం.. ఈ నాలుగు రాశుల వారు జాగ్ర‌త్త ఉండాల్సిందే..!

Solar Eclipse | జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం, సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం శని రాశి అయిన కుంభ రాశిలో సంభవిస్తుంది. గ్రహణం జరుగుతున్న సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. అందువల్ల ఈ గ్రహణం అనేక రాశిచక్రాలకు శుభప్రదమైనదిగా రుజువు చేస్తుంది. కానీ నాలుగు రాశుల‌కు మాత్రం ప్ర‌తికూల‌త‌లు చూపనున్నాయి. ఈ నాలుగు రాశుల వారికి అనేక ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌నున్నాయి. వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగ‌క ఆందోళ‌న‌ల‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

సూర్యగ్రహణం ఎప్పుడు?

ఫిబ్రవరి 17, 2026, మంగళవారం, ఫాల్గుణ అమావాస్య రోజున, సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం సాయంత్రం 05:26 గంటలకు సంభవించి రాత్రి 07:57 గంటలకు ముగుస్తుంది. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతకం కాలం పరిగణించబడదు.

ఈ రాశుల వారు జాగ్ర‌త్తగా ఉండాల్సిందే..!

సింహ రాశి( Leo )

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా శివ‌రాత్రి త‌ర్వాత సింహ రాశి వారికి ఆర్థిక క‌ష్టాలు వెంటాడ‌నున్నాయి. ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంది. గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు అత్య‌ధిక న‌ష్టాలు చవిచూడాల్సి వ‌స్తుంది. సంసార జీవితంలో స‌మ‌స్య‌లు అధికం కానున్నాయి. మొత్తానికి మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కోల్పోయే అవ‌కాశం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వారు కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌యం ఇది. వీరు కూడా మోస‌పోయే ప్ర‌మాదం ఉంది. ఏదైనా మాట్లాడే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ల‌భించ‌దు. ఉద్యోగ‌స్తులు ఒత్తిడి, ఆందోళ‌న‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది.

తుల రాశి (Libra)

తుల రాశి వారికి ప్రయాణంలో సమస్యలు ఎదురు అవుతాయి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి.

కుంభ రాశి  (Aquarius)

కుంభ రాశి వారికి శివ రాత్రి తర్వాత, రాహు, కేతువు ప్రభావంతో ఏర్పడే సూర్య గ్రహణం వలన అనేక సమస్యలు ఎదురు కానున్నాయంట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.

Tags: