మీరు ఈ తేదీల్లో జ‌న్మించారా..? అయితే డ‌బ్బు సంపాదించ‌డం క‌ష్టమేన‌ట‌..!

ఎంత క‌ష్ట‌ప‌డ్డా కూడా ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇందుకు పుట్టిన తేదీ కూడా కార‌ణ‌మ‌ని న్యూమ‌రాల‌జిస్టులు చెబుతున్నారు. కొన్ని తేదీల్లో జ‌న్మించిన వారికి జీవితంలో డ‌బ్బు సంపాదించ‌డం క‌ష్ట‌మ‌ని సూచిస్తున్నారు. మ‌రి ఆ తేదీలేమిటో తెలుసుకుందాం..

  • Publish Date - April 22, 2024 / 07:39 AM IST

కోటి విద్య‌లు కూటి కోస‌మే. నిత్యం క‌ష్ట‌ప‌డేది డ‌బ్బు కోస‌మే. చేతి నిండా డ‌బ్బు ఉన్న‌ప్పుడే ఆనంద‌క‌ర‌మైన‌, ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డిపే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి డ‌బ్బు సంపాదించేందుకు రాత్రింబ‌వ‌ళ్లు కష్ట‌ప‌డుతుంటారు. ఇలా క‌ష్ట‌ప‌డ్డ వారిలో కొంద‌రికి క‌లిసి వ‌స్తుంది. కొంద‌రికేమో క‌లిసి రాదు. ఎంత క‌ష్ట‌ప‌డ్డా కూడా ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇందుకు పుట్టిన తేదీ కూడా కార‌ణ‌మ‌ని న్యూమ‌రాల‌జిస్టులు చెబుతున్నారు. కొన్ని తేదీల్లో జ‌న్మించిన వారికి జీవితంలో డ‌బ్బు సంపాదించ‌డం క‌ష్ట‌మ‌ని సూచిస్తున్నారు. మ‌రి ఆ తేదీలేమిటో తెలుసుకుందాం..

2, 11, 20, 29 తేదీల్లో జ‌న్మించారా..?

2, 11, 20, 29 తేదీల్లో జ‌న్మించిన వారికి జీవితంలో డ‌బ్బు సంపాదించ‌డం కొద్దిగా క‌ష్ట‌త‌ర‌మవుతుంది. జీవితంలో ఆర్థికంగా స్థిర‌ప‌డ‌లేరు. ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టి ప‌ని చేస్తేనే వీరికి ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూరుతాయి. కాబ‌ట్టి ఆర్థికంగా ఎద‌గాలంటే ప్ర‌త్యేకంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో జ‌న్మించిన వారికి వార‌స‌త్వ సంప‌ద కూడా పెద్ద‌గా ల‌భించే అవ‌కాశం లేదు.

4, 13, 22, 31 తేదీల్లో జ‌న్మించారా..?

ఈ తేదీల్లో పుట్టిన వారికి డ‌బ్బు సంపాదించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. ఎంత శ్ర‌మించినా కూడా డ‌బ్బు మాత్రం స‌మ‌కూర‌దు. జీవితంలో చివ‌ర‌కు నిరాశ ఆవ‌హిస్తుంది. అల‌సిపోకుండా ప్ర‌య‌త్నిస్తే త‌ప్ప ఆర్థికంగా ఎద‌గ‌లేరు. పాజిటివ్‌గా ఆలోచించి, నెగెటివిటి ద‌రిచేర‌నీయ‌క‌పోతే మంచి ఫ‌లితాలు పొందే అవ‌కాశం ఉంటుంది.

7, 16, 25 తేదీల్లో జ‌న్మించారా..?

ఈ తేదీల్లో జ‌న్మించిన వారు అయితే ఆగ‌ర్భ శ్రీమంతులుగా ఉంటారు. లేదా చాలా డ‌బ్బు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంటుంది. నిర్ధిష్ట‌మైన ల‌క్ష్యాలు పెట్టుకుని ప‌ని చేస్తే త‌ప్ప వీరు ఆర్థికంగా లాభ‌ప‌డ‌రు. ఏదైనా వృత్తి వ్యాపారాలు ప్రారంభించే ముందు పూర్తి అవ‌గాహ‌న‌తో చేప‌డితేనే లాభాలుంటాయి. ఇలా జాగ్రత్తలు పాటించి అడుగు ముందుకు వేయ‌క‌పోతే నష్ట పోయే ప్రమాదం పొంచి ఉంటుంది.

3, 12, 21, 30 తేదీల్లో జ‌న్మించారా..?

ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత కానీ అదృష్టం వీరిని వరించదు. అర్థం చేసుకునే గుణం, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండి ముందుకు సాగడం ద్వారా వీరు విజయం సాధించవచ్చు. వ్యక్తిగతంగా వీరికి ఉండే ప్రత్యేక నైపుణ్యాలే వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కనుక వీరు వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ఉండడం అవసరం.

Latest News