Vastu Tips | పడక గదిలో ఈ చిన్న తప్పు చేస్తున్నారా..? దంపతుల మధ్య ఎప్పుడూ కలహాలే..!
Vastu Tips | ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం విషయంలో వాస్తు నియమాలు( Vastu Tips ) పాటిస్తుంటారు. కానీ ఇంటి నిర్మాణం తర్వాత కిచెన్( Kitchen ), బెడ్రూం( Bedroom ) విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లు కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంటాయి. మరి ముఖ్యంగా పడక గదిలో చేసే ఈ చిన్నతప్పు వల్ల భార్యాభర్తల( Couples ) మధ్య ఎప్పుడూ కలహాలే చోటు చేసుకుంటాయని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు.
Vastu Tips | ప్రతి ఇంట్లో బెడ్రూం( Bedroom ) ఉండడం సహజం. కానీ ఆ పడక గది వాస్తు ప్రకారం ఉండాలని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. ఆ పడక గదిలో ఏ చిన్న తప్పు జరిగినా సరే అది వైవాహిక జీవితం( Couple Life )పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. బెడ్రూంలో ఎలాంటి తప్పులు చేయకూడదో.. ఈ కథనంలో తెలుసుకుందాం..
దంపతులు( Couples ) నిద్రించే పడక విషయంలో.. చాలా జాగ్రత్తలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పడక మాత్రం నైరుతి దిశలోనే ఉండాలని చెబుతున్నారు. బెడ్ ఈశాన్యం లేదా ఆగ్నేయ దిశలో ఉంటే అది ఘర్షణకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే పడక మాత్రం నైరుతి దిశలో ఉండాలని సూచిస్తున్నారు. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంటి గోడకు కొంత గ్యాప్ ఉంచి బెడ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. సజ్జా లేదా, మధ్య పిల్లర్‌కి కిందుగా, పిల్లర్ ఎదురుగా పడక ఉండకూడదంట. ఇది భార్యాభర్తల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది బెడ్ రూమ్‌లో అస్సలే అద్దం పెట్టకూడదంట. కానీ చాలా మంది బెడ్ రూమ్‌లో తప్పకుండా అద్దం పెట్టుకుంటారు. కానీ బెడ్ రూమ్‌లో అద్ధం పెట్టడం అశుభం అంటున్నారు వాస్తు నిపుణులు. బెడ్ రూమ్‌లో అద్దం ఉంటే, భార్య భర్తల మధ్య ఎప్పుడూ తగాదాలే ఉంటాయంట.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram