Shravana Masam | ఆర్థిక సమస్యలు ఉన్నాయా..? పెళ్లికావడం లేదా? అయితే శ్రావణ మాసంలో ఇలా పూజలు చేయండి..!
Sravana Masam | హిందూ పురాణాల్లో శ్రావణ మాసానికి ప్రముఖ స్థానం ఉన్నది. ఈ మాసంలో హిందువులంతా ఎక్కువగా పరమేశ్వరుడిని పూజిస్తుంటారు. చంద్రమానం ప్రకారం.. ఈ ఏడాది శ్రావణ మాసం నేడు (ఆగస్టు 5)తో ప్రారంభమైంది.

Shravana Masam | హిందూ పురాణాల్లో శ్రావణ మాసానికి ప్రముఖ స్థానం ఉన్నది. ఈ మాసంలో హిందువులంతా ఎక్కువగా పరమేశ్వరుడిని పూజిస్తుంటారు. చంద్రమానం ప్రకారం.. ఈ ఏడాది శ్రావణ మాసం నేడు (ఆగస్టు 5)తో ప్రారంభమైంది. సెప్టెంబర్ 3వ తేదీతో ముగియనున్నది. అయితే, ఈ శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖత ఉన్నది. ఈ మాసంలోని సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలతో మంచి ఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు.
అలాగే, గ్రహదోషాలు సైతం తొలగిపోతాయని పేర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు బాధలు, పెళ్లిళ్లు కుదరక ఇబ్బందిపడుతున్న వారు పూజలు చేసే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. శుక్రవారం గోవుకు రొట్టెలు తినిపిస్తే అశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ మాసంలోని మంగళవారం రోజున వివాహం కానివారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు మంగళగౌరి వ్రతం చేసుకోవడం, కుజగ్రహం వద్ద దీపాలు పెట్టడం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోయి.. శీఘ్రమే పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. మానసిక సమస్యలున్న వారు శ్రావణ సోమవారాల్లో పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. బిల్వపత్రంతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు.
ఇలా చేస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని చెబుతున్నారు. శ్రావణ బుధవారం శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే.. అప్పుల బాధల నుంచి గట్టెక్కుతారు. గోమాతకు బెల్లం పెడితే శనిగ్రహ దోషాలు నివారణ అవుతాయి. ఇక ఈ మాసంలో మద్యం, మాంసానికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అదే సమయంలో, ఇతరులను దూషించే అలవాటును మానుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, బెండకాయలను తినకూడని చెబుతున్నారు.