మీ పిల్లలు ప్ర‌వేశ ప‌రీక్ష‌లు రాస్తున్నారా..? ఈ వాస్తు నియమాలు పాటిస్తే ర్యాంకుల పంట పండించొచ్చు..!

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొనేందుకు చాలా మంది పిల్ల‌లు భ‌య‌ప‌డుతుంటారు. ఎంత చ‌దివినా కూడా ఎగ్జామ్‌లో స‌రిగా రాయ‌లేక‌పోతారు. ఇందుకు కార‌ణం.. వాస్తు నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డ‌మేన‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో పిల్ల‌ల విష‌యంలో కొన్ని వాస్తు నియ‌మాలు పాటిస్తే.. వారికున్న భ‌యం తొల‌గిపోయి ప‌రీక్ష‌లు ధైర్యంగా రాసే అవ‌కాశం ఉంటుంది.

మీ పిల్లలు ప్ర‌వేశ ప‌రీక్ష‌లు రాస్తున్నారా..? ఈ వాస్తు నియమాలు పాటిస్తే ర్యాంకుల పంట పండించొచ్చు..!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల కాలం కొన‌సాగుతోంది. ఆయా త‌ర‌గ‌తులు, కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం గురుకులాల నుంచి మొద‌లుకుంటే యూనివ‌ర్సిటీల వ‌ర‌కు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల నిర్వహిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా ఎంసెట్ ప‌రీక్ష‌లు. ఈ ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొనేందుకు చాలా మంది పిల్ల‌లు భ‌య‌ప‌డుతుంటారు. ఎంత చ‌దివినా కూడా ఎగ్జామ్‌లో స‌రిగా రాయ‌లేక‌పోతారు. ఇందుకు కార‌ణం.. వాస్తు నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డ‌మేన‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో పిల్ల‌ల విష‌యంలో కొన్ని వాస్తు నియ‌మాలు పాటిస్తే.. వారికున్న భ‌యం తొల‌గిపోయి ప‌రీక్ష‌లు ధైర్యంగా రాసే అవ‌కాశం ఉంటుంది. దీంతో మంచి మార్కులు సాధించి, ర్యాంకుల పంట పండించేందుకు ఛాన్స్ ఉంటుంది. మ‌రి ఆ వాస్తు నియ‌మాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌రీక్ష‌లు బాగా రాయాలంటే పాటించాల్సిన వాస్తు నియ‌మాలు ఇవే..

  • పిల్ల‌లు చ‌దువుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా ఒక స్ట‌డీ రూమ్‌ను ఏర్పాటు చేయాలి. వాస్తు ప్ర‌కారం ఈ గ‌ది తూర్పు లేదా ప‌డ‌మ‌ర దిశ‌లో ఉండేలా చూసుకోవాలి.
  • ఈ గ‌దిలోకి గాలి, వెలుతురు ప్ర‌స‌రించేలా చూసుకోవాలి. సూర్య‌కాంతి ధారాళంగా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే మెద‌డుకు ఒత్తిడి లేకుండా ఉంటుంది. దీంతో చ‌ద‌వాల‌నే మ‌రింత సంక‌ల్ప బ‌లం వ‌స్తుంది.
  • స్ట‌డీ రూమ్‌కి వాస్తు ప్ర‌కారం లైట్‌ గ్రీన్‌, బ్లూ, యెల్లో, వైట్ వంటి కలర్‌లు వేస్తే మంచిది. ఈ కలర్‌లు వారిలో ఏకాగ్రతను పెంచుతాయి.
  • అలాగే పిల్లలు చదువుకునే టేబుల్‌ దీర్ఘ చతురస్రాకారంలో సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
  • వారి స్టడీరూమ్‌లో సరస్వతీ దేవి, గణపతి దేవుళ్ల ఫొటోఫ్రేమ్‌లను ఏర్పాటు చేయాలి. దీంతో వారిలో ఏకాగ్రత పెరుగుతుంది.
  • అలాగే వారు పరీక్షకు వెళ్లేటప్పుడు పాలలో కొద్దిగా బెల్లం కలిపి తాగించండి. దీనివల్ల వారు ప్రశాంతంగా పరీక్షలు రాస్తారని నిపుణులు చెబుతున్నారు.

గాయ‌త్రీ మంత్రం జ‌పిస్తే ఇంకా మంచిది..

చాలా మంది పిల్లలు పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళనకు గుర‌వుతారు. ఇలాంటి సంద‌ర్భంలో గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే చాలా బెట‌ర్. ఈ మంత్రాన్ని ఎగ్జామ్స్‌ టైమ్‌లో పఠించడం వల్ల వారిలో ఉన్న భయం మొత్తం తొలగిపోయి, ధైర్యం వస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని వాస్తు నిపుణులంటున్నారు.
గాయత్రీ మంత్రం

ఓమ్‌ భూర్‌ భువః సువః తత్‌ సవితుర్‌ వరేణ్యం

భర్గో దేవస్య ధీమహీ

ధియో యోనః ప్రచోదయాత్‌!