తెలంగాణ ఎప్‌సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఎప్‌సెట్(ఎంసెట్) షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, 26 నుంచి ఏప్రిల్ 6వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

విధాత : తెలంగాణ ఎప్‌సెట్(ఎంసెట్) షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, 26 నుంచి ఏప్రిల్ 6వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణ ఎప్‌సెట్ పరీక్షలు మే 9 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లుగా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారు.. ఈ నెల 21న టీఎస్ ఎప్‌సెట్(ఎంసెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు.
మార్చి 12న పీజీ ఈసెట్ నోటిఫికేషన్
మార్చి 12వ తేదీన టీఎస్ పీజీఈసెట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణ కుమారి వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన పీజీఈసెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరగనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మార్చి 16వ తేదీ నుంచి మే 10వతేదీవరకు ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 6వ తేదీ నుంచి 9 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ పీజీఈసెట్‌ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది.