Vastu Tips | పడక గదిలో ఆ ఫొటోలు..! శుభమా.. అశుభమా..?
Vastu Tips | చాలా మంది తమ ఇండ్లలో పూర్వీకుల ఫొటో( Ancestor photo )లతో పాటు మరణించిన వ్యక్తుల ఫొటో( Deceased Person Photo )లను కూడా ఉంచుతారు. అయితే ఈ ఫొటోలను పూజ గదిలో, పడక గది( Bed Room )లో ఉంచుతుంటారు. ఇలా ఉంచడం శుభమా..? అశుభమా..? అనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

Vastu Tips | ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులను గౌరవిస్తారు. వారు కాలం చేసిన తర్వాత వారి చిత్రపటాలను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. అయితే మరణించిన పూర్వీకుల ఫొటో( Ancestor photo )లకు కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. ఇంట్లో ఎక్కడ అంటే అక్కడ ఈ ఫొటోలను ఉంచకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరణించిన వ్యక్తుల ఫొటో( Deceased Person Photo )ల ఏర్పాటు విషయంలో వాస్తు నియమాలు విస్మరిస్తే దురదృష్టకరమైన ఫలితాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా పూర్వీకుల చిత్రపటాలను పూజగదిలో, పడక గది( Bed Room )లో ఉంచొచ్చా..? ఉంచితే శుభమా..? అశుభమా..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మరణించిన వ్యక్తుల ఫొటోలకు వాస్తు నియమాలు ఇలా..
పూజ గదిలో పూర్వీకుల చిత్రపటాలను ఉంచడం మంచిది కాదట. వాస్తు ప్రకారం ఇది అశుభకరమైన చర్యగా పరిగణించబడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఫోటోను పూజ గదిలో దేవుని విగ్రహం లేదా చిత్రాలతో పాటు కలిపి ఎప్పుడూ ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇక చాలా మంది తమ కుటుంబంలో కాలం చేసిన వారి చిత్రపటాలను పడక గదిలో ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇది కూడా అశుభకరమని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్వీకుల ఫోటోను బెడ్‌రూమ్‌తో పాటు, వంటగదిలో, బాత్రూమ్ సమీపంలో గోడల దగ్గర కూడా ఉంచకూడదని సూచిస్తున్నారు.
చాలా మంది తమ పూర్వీకుల చిత్రాలను ఇళ్ల గోడలపై వేలాడదీస్తారు. ఇలా ఎక్కడ బడితే అక్కడ పెట్టడం కూడా వాస్తు శాస్త్రంలో తప్పుగా పరిగణించబడుతుంది. చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎప్పుడూ గోడపై వేలాడదీయకూడదు, బదులుగా పూర్వీకుల చిత్రాలను చెక్క స్టాండ్ లేదా టేబుల్‌పై ఉంచాలి.
వాస్తు ప్రకారం చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. అంతేకాదు పూర్వీకుల ఫోటోను ఉత్తర దిశలో కూడా ఉంచవచ్చు. అయితే ఈ దిశలో ఫోటోను ఉంచేటప్పుడు.. వారి ముఖం దక్షిణం వైపు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని గుర్తుంచుకోండి.