బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అనుకోకుండా ధ‌న‌సంప‌ద‌..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అనుకోకుండా ధ‌న‌సంప‌ద‌..!

మేషం

అన్ని రంగాల వారు ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలున్నా అధిగమిస్తారు. ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త ప్రాజెక్టులు ఈ రోజు మొదలుపెట్టకండి.

వృషభం

ఈ రోజు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంతో పరిష్కరిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. స్నేహితులతోనూ, కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి.

మిథునం

ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో అదనపు పెట్టుబడులు సమకూరుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనితీరుకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.

కర్కాటకం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్యం కారణంగా మానసికంగా అస్థిరతతో ఉంటారు. ఏ పనిమీద దృష్టి సారించలేకపోతారు. వ్యాపారంలో నష్టాలు మానసిక ఆందోళనకు కారణమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని సర్దుబాటు ధోరణితో ఉంటే సమస్యలు తగ్గుతాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. పని మీద ఏకాగ్రత, చిత్తశుద్ధితో ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

కన్య

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్తగా ప్రారంభించే పనులు ఈ రోజు వాయిదా వేస్తే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి నిరాశాజనకంగా ఉంటుంది. ఆర్ధికంగా మోసపోయే ప్రమాదముంది. మోసపూరిత వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్ధిక నష్టం సూచితం.

వృశ్చికం

పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ స్థాయి పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాల కారణంగా మంచి లాభాలను అందుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండక పోవచ్చు. మీరు చాలా ఇబ్బందిలో పడే అవకాశముంది. అనుభవజ్ఞుల సలహాలు తప్పకుండా తీసుకోవాలి. ఉద్యోగులకు గడ్డుకాలం. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదం.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కుంభం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొని డబ్బు పోగొట్టుకుంటారు. అయితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగల మీ సామర్ద్యం ఈ రోజు మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పోటీ విపరీతంగా పెరుగుతుంది. ఆర్ధికంగా నష్టపోవచ్చు. మీకన్నా బలవంతులతో పోరు తగదు. పోటీ దారులతోనూ, ప్రత్యర్థులతోనూ అనవసరమైన తగాదాలు రాకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.