Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారి జీవితం అనుకోని మ‌లుపు తిరుగుతుంది..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారి జీవితం అనుకోని మ‌లుపు తిరుగుతుంది..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సరదాగా సాగిపోతుంది. శుభకార్యాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఊహించని విజయాలు మీ ఇంటి తలుపు తడతాయి. సంబరాల్లో మునిగితేలుతారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఓ వ్యవహారంలో ధనలాభం ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా తీరికలేని పనులతో ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆటంకాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే పట్టుదల, కృషి అవసరం. ఖర్చులు పెరుగుతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తి చేసి వృత్తి పరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఈ రోజు మీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. స్థానచలనం సూచన ఉంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీడియా, కళారంగం వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. వృత్తిలో మీ నైపుణ్యాన్ని అందరూ ప్రశంసిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగం వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. నూతన ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. మీ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణానికి అవకాశం ఉంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ శాంతులు లోపిస్తాయి. నిరంతరం ఘర్షణలతో మనశ్శాంతి కొరవడుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వైద్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం క్షీణించడంతో మనశ్శాంతి కోల్పోతారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి అడుగేయాలి. అధికారులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాత, మధురమైన జ్ఞాపకాలతో మీ మనస్సంతా నిండి పోతుంది.