02.08.2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశి ఫ‌లం ఎలా ఉందంటే..?

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

02.08.2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశి ఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

కీలక‌మైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు స‌రికాదు. కుటుంబ సభ్యులతో సహనంతో వ్యవహరిస్తే మంచిది. వృత్తివ్యాపారాలలో చెప్పుకోతగ్గ మార్పులేమీ ఉండవు. స్థిరాస్తి రంగం వారు నేడు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది. ఖర్చులు పెరుగుతాయి.

వృషభం

ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు, సవాళ్లు ఎదురు కావచ్చు. ఉద్యోగంలో, వ్యాపారాలలో పోటీ పెరుగుతుంది. చదువుపై దృష్టి సారిస్తే మంచిది. వ్యాపారులు ముఖ్యమైన దరఖాస్తులపై సంతకాలు గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం చేయకండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సర్వత్రా అనుకూలతలు ఉంటాయి. ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగులు తిరుగులేని ప్రతిభతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్తువులు, ఆభరణాలు కొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.

కర్కాటకం

ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన అన్ని పనులు ఆలస్యం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టం ఆందోళనకు గురి చేస్తుంది. కుటుంబ కలహాల విషయంలో ఉదాసీనంగా లేకపోతే మానసిక అశాంతి తప్పదు. వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా కూడా నష్టాలు రావచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ రోజు కలిసి వస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారు కొనుగోలు, అమ్మకాలతో మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. అనుకోకుండా ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ప్రతి విషయంలో ఆచి తూచి వ్యహరించాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టం ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉండవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో విశేషమైన ధనయోగం ఉంటుంది. కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తివ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఆర్థికంగా అనుకూలత, వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి శుభసమయం నడుస్తోంది. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కీలకమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. ఉద్యోగంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ అధిగమిస్తారు.