చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారస్థులకు కలిసివస్తుంది. లక్ష్య సాధనలో భాగంగా అనుకున్న పనులు పూర్తవుతాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్ధికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులకు అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దైవబలం అండగా ఉంటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. పనులు పూర్తి కావాలంటే మీ పూర్తి శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తే తప్ప సాధ్యం కాదు. కుటుంబంలో కలహాలతో అశాంతిగా ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిలో అభివృద్ది ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయం చేకూరుస్తాయి. వ్యాపారస్థులు మంచి లాభాలను గడిస్తారు. మీడియా, పత్రికా రంగం వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి శ్రమతోనే విజయం ఉంటుంది. పనిభారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో వివాదాలు ఏర్పడవచ్చు.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొనాలంటే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నప్పుడు మౌనంగా ఉంటే మేలు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక క్షోభ నుంచి బయట పడతారు. సన్నిహితుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. భాగస్వాములు సహకరిస్తారు. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టాలు తెస్తాయి. ఉద్యోగస్థులు పని ప్రదేశంలో గట్టి పోటీ ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే కలహాలు తప్పవు. అనారోగ్య సమస్యలుంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.