05.06.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ధ‌న‌లాభం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 5, 2024 / 07:11 AM IST

మేషం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసర వాదనల్లోకి దిగకండి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

వృషభం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధన లాభం చేకూరుతాయి. సంతోషంగా ఉంటారు. మొదలు పెట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు.

మిథునం

సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడితే మేలు. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. వృత్తివ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండవచ్చు. ఉద్యోగులు నూత బాధ్యతలు చేపడతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

కర్కాటకం

ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్ధిక సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఊహించని ధనలాభాలను అందుకుంటారు. మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అదృష్టం వరించి గొప్ప విజయాలు సాధిస్తారు.

కన్య

ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి శకునాలతో, సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే ఒక్క ప్రతికూలత కూడా ఉండదు. బంధుమిత్రులతో విందువినోదాలతో కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన శుభవార్తతో మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు. కుటుంబ సభ్యులతో శాంతంగా మాట్లాడితే మంచిది. లేకుంటే ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. ఆర్ధిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహించడం అవసరం.

వృశ్చికం

ఈ రోజు సంతోషదాయకంగా ఉంటుంది. తీరికలేని పనుల నుంచి విశ్రాంతి తీసుకోండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారులకు, ఉద్యోగులకు చేసే ప్రతి పనిలోనూ విజయం, ఆదాయ వృద్ధి ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. గృహంలో శాంతి, సౌఖ్యం ఉంటాయి. ఈ రోజంతా ఆరోగ్యగా, చురుగ్గా ఉంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులకు ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి.

మకరం

ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు మీ ఆనందాన్ని హరిస్తాయి. మానసిక ప్రశాంతత కొరవడుతోంది. తగిన విశ్రాంతి అవసరం. వ్యాపారులు నష్ఠాలు చవి చూస్తారు. స‌వాళ్లు ఎదుర‌వుతాయి.

కుంభం

సాధారణ ఫలితాలు ఉంటాయి. మీ మొండి పట్టుదల వైఖరితో జీవిత భాగస్వామితో కలహాలు రావచ్చు. ప్రతికూల పరిస్థితుల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇల్లు, ఆస్తి వంటి వ్యవహారాల్లో నిర్ణయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టే ఫలి అనే సూత్రాన్ని ఈ రోజు మీరు బాగా నమ్ముతారు. ఎంత బాగా కష్టపడి పనిచేస్తే, అంత గొప్ప విజయాలను అందుకుంటారు. నూతన దృక్పథంతో పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు.

Latest News