19.07.2024 రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి విశేష‌మైన శుభ‌ఫ‌లితాలు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

19.07.2024 రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి విశేష‌మైన శుభ‌ఫ‌లితాలు..!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. యోగా, ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది. శుభకార్యాలలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్యం సహకరించదు.

వృషభం

ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాజెక్టుల జోలికి పోవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల అలసిపోతారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. విందువినోదాలలో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు తలపెట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులకు కలిసివచ్చే రోజు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా రచయితలకు, కళాకారులకు శుభ ఫలితాలు ఉంటాయి. ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. గతంలో చేసిన పొరపాట్ల గురించి ఆలోచిస్తుంటారు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

తుల

తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే పనిలో కార్యసిద్ధి, విజయం ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దైవబలం అండగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీ సొంతం.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకులిస్తున్నందున ఈ రోజు అన్ని రంగాల వారికి శుభప్రదమైన రోజు. వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీరు ఆధ్యాత్మికంగా గడుపుతారు. తీర్థయాత్రలకు వెళతారు. మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు సూచితం. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి శుభప్రదమైన రోజు. అన్ని రంగాల వారికి ఊహించని ధనలాభాలు ఉంటాయి. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడుగా ఉండవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మేలు. ప్రతికూల ఆలోచనలు వీడి సానుకూల దృక్పధాన్ని పెంచుకుంటే మంచిది.