Hibiscus Plant | ‘మందారం పువ్వు’తో అప్పులు మాయం..! ప్రతి శుక్రవారం చేయండిలా..!!
Hibiscus Plant | మీరు అప్పులతో( Debts ) బాధపడుతున్నారా..? కుటుంబ సభ్యుల మధ్య కలహాలా..? ఈ సమస్యలతో ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందా..? అయితే వీటన్నింటికి పరిష్కారం మందారం చెట్టే. సకల వాస్తు దోష( Vastu Dosham ) నివారిణిగా పేరుగాంచిన మందారం చెట్టు(Hibiscus Plant )ను మీ ఇంటి ఆవరణలో పెంచుకోవడమే.
Hibiscus Plant | మందారం చెట్టు( Hibiscus Plant ).. ప్రతి ఇంటి ఆవరణలో కనిపించే చెట్టు. ఇక ఈ చెట్టు పువ్వులు కూడా చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మందారం ఆకు( Mandaram Leaf )తో పాటు దాని పువ్వులను ఆయుర్వేదం( Ayurvedam )లో ఉపయోగిస్తారు. మందారం పువ్వు( Mandaram Puvvu )లను పూజకు కూడా వినియోగిస్తారు. అయితే ఈ మందారం చెట్టు( Mandaram Chettu )కు దైవశక్తి ఉందని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు. సకల వాస్తు దోషాలకు మందారం మొక్క నివారిణిగా పని చేస్తుందని చెబుతున్నారు. అప్పులు కూడా మాయమై అష్టైశ్వర్యాలు కలుగుతాయని పేర్కొంటున్నారు. ప్రతి శుక్రవారం మందారం పువ్వుతో పూజ చేస్తే శుభం కలుగుతుందని సూచిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం మందారం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మందారంతో లక్ష్మీ కటాక్షం..
మందారం మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల్లో కూరుకుపోయిన వారు ఈ మొక్కను తమ ఇంటి ఆవరణలో పెంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.
మందారం పువ్వుతో పూజ..
మరి ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంట్లో డబ్బు నిల్వ చేసే చోట మందార పూలను ఉంచి.. వినాయకుడిని, దుర్గాదేవిని ధ్యానిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. ఈ పనిని 7 రోజులపాటు రోజూ చేస్తే ఆర్థిక సమస్యలు దూరమై అష్టైశ్వర్యాలు లభిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
బంధాల బలోపేతానికి మందారం పువ్వుతో పరిష్కారం..
కుటుంబ సంబంధాల్లో గొడవలు, తారసాలు జరుగుతున్నప్పుడు బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మందార పువ్వుతో ఒక పరిష్కారం ఉంది. మీరు నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకునే దిండు కింద ఈ పువ్వును ఉంచి నిద్రపోండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి సంబంధాలను మెరుగుపరుస్తుందని నమ్మకం. ఇంట్లో శాంతి కోరే వారు రాత్రివేళ రాగి గిన్నెలో నీటితో కలిపి మందార పూలను ఉంచి.. సూర్యోదయం సమయంలో సూర్యుడికి పూజ చేసి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లుకోవచ్చు. ఇది శుభాన్ని పెంచి, చెడు శక్తులను తొలగించడానికి సహాయపడుతుంది.
ఏ దిశలో మందారం మొక్కను పెంచాలి..?
వాస్తు దోష నివారిణిగా పేరుగాంచిన మందారం మొక్కను ముఖ్యంగా తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచితే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు దిశలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని వాస్తులో భావిస్తారు. అయితే మొక్క ఎండిపోకుండా తరచుగా నీరు పోస్తూ జాగ్రత్తగా పెంచాలి. ఈ విధంగా వాస్తు ప్రకారం మందార మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తిని కలగజేయడమే కాకుండా.. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను తగ్గించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram