Dhanteras Puja | నేడే ధ‌న త్ర‌యోద‌శి.. ధన్‌తేరస్ పూజకు శుభసమయం ఇదే..!

Dhanteras Puja | హిందువులు పండుగ నిర్వ‌హించుకుంటారు. ఈ సందర్భంగా ధన త్రయోదశి ఎప్పుడు..? ధ‌న్‌తేర‌స్ పూజ‌కు శుభ‌స‌మ‌యం ఎప్పుడు..? అనే విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

Dhanteras Puja | నేడే ధ‌న త్ర‌యోద‌శి.. ధన్‌తేరస్ పూజకు శుభసమయం ఇదే..!

Dhanteras Puja | అందరి జీవితాలలో వెలుగులు నింపే ఈ దీపావళి పండుగ‌( Deepavali Festival )ను ఐదు రోజుల పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. హిందువులంతా( Hindus ) ఈ పండుగ‌ను గొప్ప‌గా జ‌రుపుకుంటారు. ఆశ్వ‌యుజ బ‌హుళ త్ర‌యోద‌శి( Ashwayuja Bahula Trayodashi ) రోజున దీపావ‌ళి వేడుక‌ల‌ను ప్రారంభించి.. కార్తీక శుద్ధ విదియ రోజున భ‌గినీహ‌స్త భోజ‌నంతో వేడుక‌ల‌ను ముగిస్తారు. ఈ ఐదు రోజుల వేడుక‌ల్లో ఆశ్వ‌యుజ బ‌హుళ త్ర‌యోద‌శి చాలా ముఖ్యం. ఈ ఆశ్వ‌యుజ బ‌హుళ త్ర‌యోద‌శి రోజున ధ‌న్‌తేరాస్( Dhanteras ) లేదా ధ‌న త్ర‌యోద‌శి( Dhantrayodashi )గా హిందువులు పండుగ నిర్వ‌హించుకుంటారు. ఈ సందర్భంగా ధన త్రయోదశి ఎప్పుడు..? ధ‌న్‌తేర‌స్ పూజ‌కు శుభ‌స‌మ‌యం ఎప్పుడు..? అనే విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

ధనత్రయోదశి ఎప్పుడు..?

ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి( Dhantrayodashi )గా జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి అక్టోబర్ 29న మంగళవారం ఉదయం 10:33 గంటలకు మొదలై అక్టోబర్ 30వ తేదీ 12:35 గంటలకు ముగుస్తోంది. సాధారణంగా ధనలక్ష్మీ పూజ( Lakshmi Puja ) సాయంత్రం చేస్తారు. అందుకే త్రయోదశి తిధి సాయంత్రం సమయంలో ఉన్న అక్టోబరు 29వ తేదీనే ధన త్రయోదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు, జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు.

ధన్‌తేరస్ పూజ శుభ ముహూర్తం

హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకు ధన్‌తేరస్ పూజ(( Dhanteras Puja )కు శుభసమయం.

ధ‌న్‌తేర‌స్ పూజ చేయండిలా..

మంగ‌ళ‌వారం సాయంత్రం లక్ష్మీదేవి( Lakshmi Devi ), కుబేరుల విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ గంధం కుంకుమలతో అలంక‌రించుకోవాలి. ఆ త‌ర్వాత‌ ఆవు నేతితో దీపారాధన చేయాలి. సన్నజాజులు, కలువ పూలతో లక్ష్మీ దేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. సువాసనలు వెదజల్లే పన్నీరు, గంధ పుష్పాక్షతలను అమ్మవారికి సమర్పించాలి. ఆవు పాలు, పంచదార ఏలకులు, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. శక్తి ఉన్నవారు బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేసి పూజలో ఉంచుకోవచ్చు. అనంతరం శ్రీ లక్ష్మీదేవికి కర్పూర నీరాజనాలు ఇవ్వాలి.

బంగారం, వెండి త‌ప్ప‌కుండా కొనాలా..?

ధన్‌తేరస్‌ రోజున బంగారు( Gold ), వెండి( Silver ) ఆభరణాలు, పాత్రలు, ఇత్తడి, చీపుర్లు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. ఆ ఇంట అష్టైశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ని న‌మ్మ‌కం. చాలా మంది కొంటున్నారు కదా అని పోటీపడి అప్పులు చేసైనా బంగారం కొంటే అప్పులు వృద్ధి చెందుతాయి కానీ, సిరి సంపదలు వృద్ధి చెందవన్న సత్యాన్ని గ్రహించాలి.

tags –