శ‌నివారం ఈ వ‌స్తువుల‌ను కొంటున్నారా..? అయితే ద‌రిద్రాన్ని ఆహ్వానించిన‌ట్లే..!

శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని, ఆయన చెడు చేసే వారికి చెడుగా, మంచి చేసే వారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారని పండితులు చెబుతారు. కాబ‌ట్టి శ‌నివారం పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను కొన‌కూడ‌దు.

శ‌నివారం ఈ వ‌స్తువుల‌ను కొంటున్నారా..? అయితే ద‌రిద్రాన్ని ఆహ్వానించిన‌ట్లే..!

చాలా మంది తెలిసీతెలియ‌క ఎన్నో త‌ప్పులు చేస్తుంటారు. అలా చేసిన త‌ప్పుల‌కు శిక్ష అనుభవిస్తారు. త‌ప్పులు చేసిన త‌ర్వాత దేవుడా మ‌న్నించు అని ప్రార్థిస్తారు. సహజంగా అందరూ శని అంటేనే భయపడి పోతుంటారు. అయితే శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని, ఆయన చెడు చేసే వారికి చెడుగా, మంచి చేసే వారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారని పండితులు చెబుతారు. కాబ‌ట్టి శ‌నివారం పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను కొన‌కూడ‌దు. ఈ వ‌స్తువుల‌ను కొన్నా, ఇత‌రుల నుంచి తీసుకున్నా.. ఇంట్లోకి ద‌రిద్రాన్ని ఆహ్వానించిన‌ట్లేన‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శ‌నివారం రోజు ఎలాంటి నూనెలు కొన‌రాదు. ఆ రోజు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాల‌వుతార‌ని చెబుతున్నారు. గుడిలో దీపం వెలిగించాల‌నుకునే వారు.. దుకాణంలో నూనె కొనుగోలు చేసి, నేరుగా ఆల‌యానికే తీసుకెళ్లాలి. కానీ ఇంటికి తీసుకురాకూడ‌దు.

  • ఇక శ‌నివారం రోజు నూనెల‌ను ఒక‌రి చేతి నుంచి మ‌రొక‌రికి అందించ‌రాదు. అలా చేస్తే దారిద్య్రం వెంటాడుతుంది.
  • శ‌నివారం అస‌లు ఉప్పు కొన‌కూడ‌దు. ఉప్పు కొంటే ముప్పేన‌ట‌. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పును శనివారం కొంటే దరిద్ర దేవతను ఇంటికి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతున్నారు.
  • శనిదేవుని పూజలో ప్రధానంగా వాడే నువ్వులు శనివారం రోజు కొనరాదు. ఏ అవసరం కోసమైనా శనివారం నువ్వులు కొంటే అష్టకష్టాలు పడతారని శాస్త్రం చెబుతోంది.
  • ప‌త్తి, బొగ్గు, న‌ల్ల‌ని వ‌స్త్రాలు, ఇనుముతో త‌యారు చేసిన వ‌స్తువుల‌ను కూడా అస‌లు కొనరాదు. వేరొక‌రి నుంచి తీసుకోకూడ‌దు. మినుముల‌ను కూడా కొన‌కూడ‌దు.