Spiritual | పూజ గదిలో ఈ వస్తువులను నేలపై పెడుతున్నారా..? అయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట..!!
Spiritual | చాలా మంది హిందూవులు( Hindus ) ప్రతి రోజు తమ నివాసాల్లో ఆయా దేవుళ్లకు పూజలు( Puja ) చేస్తుంటారు. ఈ పూజలు చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. పూజా గది( Puja Room )లోని కొన్ని వస్తువులను నేలపై పెడుతుంటారు. ఆ వస్తువులను నేలపై పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం( Lakshmi Kataksham ) తగ్గిపోతుందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.

Spiritual | హిందూ సంప్రదాయం( Hindu custom )లో పూజ గది( Puja Room )ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్నానం ఆచరించకుండా ఆ గదిలోకి అడుగు పెట్టరు. స్నానం( Bath ) చేసిన తర్వాతే.. ఇంటిని శుభ్రపరుచుకుని పూజ గదిలోకి అడుగుపెడుతారు. ఆ తర్వాతే దీపారాధన చేసి పూజలు చేస్తుంటారు. అయితే తెలిసీతెలియక చాలా మంది పూజ గదిలోని కొన్ని వస్తువులను నేలపై పెట్టేస్తుంటారు. ఇలా నేలపై పెట్టడం వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, లక్ష్మీ కటాక్షం( Lakshmi Katakashkam ) పూర్తిగా తగ్గిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి నేలపై పెట్టకూడని ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
శంఖం
విష్ణుమూర్తి( Vishnu Murthy )కి ఎంతో ప్రియమైన శంఖం( Shankham ).. చాలా పూజగదుల్లో ఉంటుంది. ఈ శంఖం వల్ల లక్ష్మీ దేవి( Lakshmi Devi ) అనుగ్రహం ఉంటుందని భక్తులు( Devotees ) నమ్ముతుంటారు. అయితే కొందరు తెలియక పవిత్రమైన శంఖాన్ని నేలపై పెడుతుంటారు. కానీ, ఎట్టిపరిస్థితుల్లో కూడా శంఖం కింద పెట్టకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట.
గంట
దాదాపు ప్రతి పూజ గదిలో గంట( Bell ) తప్పకుండా ఉంటుంది. దేవుడికి పూజల అనంతరం గంటను మోగిస్తుంటాం. అయితే, పూజ గదిని శుద్ధి చేసే క్రమంలో చాలా మంది గంటను నేలపైన పెడుతుంటారు. కానీ, ఇలా నేల పైన అస్సలు పెట్టకూడదట. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి, ధనం నీళ్లలా ఖర్చు అవుతుందట.
శివలింగం
ఇక చాలా మంది తమ పూజ గదుల్లో శివలింగాన్ని( Shivalingam ) ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే పూజకు ముందు గానీ, ఆ తర్వాత గానీ.. శివలింగాన్ని కింద పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు.
పూలు
పూజ కోసం చాలా మంది పూలను( Flowers ) మార్కెట్‌లో కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తారు. పూల కవర్‌ని నేలపైనే పెట్టేస్తుంటారు. అయితే నేలపై పెట్టిన పూలను పూజకు వినియోగించకూడదట. ఒక్క పారిజాత పుష్పాలను( Parijatha Pushpam ) మాత్రం కిందపెట్టినవి పూజకు వినియోగించొచ్చని పండితులు చెబుతున్నారు.
బంగారం
బంగారం, బంగారం( Gold )తో చేసిన ఆభరణాలు ఏవైనా కూడా నేలపైన పెట్టకూడదు. ఇలా పెడితే ధన లక్ష్మీ( Dhana Lakshmi ) ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట. కాబట్టి మీరు కూడా ఈ పొరపాట్లు చేయకుండా పూజలో పాల్గొనండి.. లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోండి.