Vastu Tips | మీ పడక గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందా..? ఆలుమగలు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
Vastu Tips | వాస్తు శాస్త్రం( Vastu Tips ) ప్రకారం, అటాచ్డ్ బాత్రూమ్( Attached Bathroom ) విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కొన్ని పొరపాట్ల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మీ వైవాహిక జీవితం( Married Life )లో కూడా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.

Vastu Tips | ప్రతి ఇంటికి బాత్రూమ్( Bathroom ) తప్పనిసరి. ఇక ప్రతి పడక గది( Bed Room )కి అటాచ్డ్ బాత్రూమ్( Attached Bathroom ) ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కూడా వాస్తు నియమాలకు( Vastu Tips ) అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. అయితే వాస్తు నియమాలకు అనుగుణంగా బెడ్రూమ్‌కు అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించినప్పటికీ.. ఆలుమగలు( Couples ) చేసే పొరపాట్ల వల్ల ఆ ఇంట్లో అశాంతి నెలకొని, భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ విషయంలో ఆలుమగలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. మరి ఆ జాగ్రత్తలు ఏవో తెలుసుకుందాం..
ఆలుమగలు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రభావం భార్యభర్తల సంబంధాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆలుమగలు కలిసి నిద్రించేటప్పుడు బాత్రూమ్ వైపు పాదాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా కాళ్లు చేసి పడుకుంటే మీ దాంపత్య జీవితంలో గొడవలు పెరిగే అవకాశం ఉంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు నిద్రించడానికి ముందు మీ బాత్రూమ్ తలుపును తప్పనిసరిగా మూసి ఉంచాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చేయకపోయినా ఆలుమగల దాంపత్య జీవితంలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇది మీ ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి పడుకునే ముందు బాత్రూమ్ తలుపులు మూసేయండి.
బాత్రూమ్‌కు పెయింటింగ్ వేసేటప్పుడు లైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు బాత్రూమ్స్‌కు సరిగ్గా సరిపోతాయి. బాత్రూమ్స్‌లో నీలి రంగు బకెట్ లేదా టబ్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల శుభ ఫలితాలొస్తాయి. అయితే నలుపు, ఎరుపు రంగుల బకెట్లు లేదా టబ్‌లను ఉపయోగించొద్దు.
మనలో చాలా మంది బాత్రూమ్స్‌లో బట్టలు ఉతకడం, ఆ తడి బట్టలను నల్లాలపై ఉంచడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా ఎప్పటికీ చేయకూడదు. బాత్రూమ్స్‌లో తడి బట్టలు ఉంచడం వల్ల వాస్తు దోషాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బాత్రూమ్స్‌లో ఎక్కువ సమయం నానబెట్టిన బట్టలను ఉంచకండి.