Vinayaka Chavithi | గణనాథుడికి గరిక పోచలంటే ఎందుకంత ప్రీతి..? ఎన్ని గడ్డిపోచలతో ఆరాధిస్తే మంచిదో తెలుసా..?
Vinayaka Chavithi | గణనాథుడికి గరిక( Garika ) పోచలంటే ఎంతో ప్రీతి. రెండు పోచలున్న గరికను బొజ్జ గణపయ్యకు( Ganesh ) సమర్పించడం వల్ల భక్తుల జీవితాల్లో అన్ని శుభాలే జరుగుతాయనేది నమ్మకం. కాబట్టి వినాయకుడి( Vinayaka )ని గరిక పోచలతో పూజిస్తుంటారు.

Vinayaka Chavithi | నేడు గణేశ్ చతుర్ధి( Ganesh Chaturthi ) కారణంగా వినాయక నవరాత్రులకు భక్తులందరూ( Devotees ) సిద్ధమైపోయారు. గణనాథుడికి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే లంబోదరుడికి ఎంతో ఇష్టమైన గరిక( Garika ) పోచలతోనే పూజలు ప్రారంభిస్తారు. రెండు పోచలున్న గరిక పోచలతో వినాయకుడిని పూజిస్తే.. ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గరికను దూర్వా అని పిలుస్తారు. మరి గరికకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం.. అనలాసురుడు( Analasurudu ) అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంత దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమను ఎలాగైన కాపాడాలని గణనాథుడిని వేడుకోగా, వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుడిని మింగేశాడట. ఆ తర్వాత విఘ్నేశ్వరుడి శరీరంలో వేడి మొదలైందట. చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడట. అయినా కూడా వేడి తగ్గలేదట. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడట. పరమశివుడు తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడట. ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదట. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు ఘనాపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల 21 గరిక పోచలు గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలిగిందని పురాణాలు చెబుతున్నాయి.
అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడట. ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడు తన ఆశీర్వాదాలుంటాయని, కష్టనష్టాలు తీరుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు ఏ పని అయినా ఆరంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విఘ్నాలు ఉండవని కూడా గణపతి వరమిస్తాడు.
అలా వినాయకుడికి, గడ్డి పోచకూ లంకె కుదిరింది. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ, సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన. అందుకే దూర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై, శీఘ్ర ఫలితం ఇస్తాడని విశ్వసిస్తారు.