Vinayaka Chavithi | రేపే వినాయక చవితి.. ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
Vinayaka Chavithi | హిందువులు( Hindus ) చాలా మంది గణనాథుడిని( Ganesh ) ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వినాయకుడికే మొదటి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఇతర కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉంటే ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. మరి వినాయక చవితి( Vinayaka Chavithi )ఎల్లుండే.. అదే బుధవారం. దీంతో ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి పట్టిందల్లా బంగారమే కానుందట.
Vinayaka Chavithi | వినాయక చవితి( Vinayaka Chavithi )వచ్చిందంటే చాలు.. గల్లీకో గణనాథుడు( Ganesh ) దర్శనమిస్తాడు. అంతేకాదు.. ప్రతి ఇంట్లోనూ లంబోదరుడు కొలువుదీరుతాడు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలా తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో గణనాథుడిని బుధ గ్రహ కారకంగా భావిస్తారు. ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే.. వారికి వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయట. అయితే గణేశ్ చతుర్ధి సందర్భంగా.. ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారి పట్ల సానుకూల శక్తి ఉంటుందట. ఆ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందట. మరి ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం..
మేష రాశి( Aries )
మేష రాశి వారి పట్ల గణనాథుడు ఎంతో దయతో ఉంటాడట. వినాయకుడు ఈ రాశివారికి చల్లని చూపును ప్రసాదిస్తాడట. ఏ పని చేసినా విజయం సాధిస్తారట. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుందట. ఇక ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు పొంది.. విజయానికి బాటలు వేసుకుంటారట. మొత్తం ఆనందకర వాతావరణం నెలకొనడంతో పాటు పట్టిందల్లా బంగారమే కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి( Capricorn )
ఈ వినాయక చవితి నేపథ్యంలో మకర రాశి వారికి గణనాథుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయట. కెరీర్ పరంగా కూడా అనుకూలంగా ఉందట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడి.. అష్టైశ్వర్యాలు పొందుతారట. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొనడంతో పాటు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు అందుకుంటారని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి( Aquarius )
గణనాథుడి ఆశీస్సులతో కుంభ రాశి వారికి ఊహించని విధంగా లాభాల బాట పడుతారట. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి పట్టిందల్లా బంగారమే కానుందట. కోర్టు వ్యవహరాలు కూడా అనుకూలంగా ఉంటాయట. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారి కల నెరవేరుతుందట. ఇక సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
మీన రాశి( Pisces )
మీన రాశి వారికి కూడా మెండుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయట. చాలా కాలం నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారి కల నెరవేరుతుందట. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొననుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి మ్యాచ్ ఫిక్స్ అవుతుందట. చాలా ఆనందంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram