Ugadi Rasi Phalau 2025 | విశ్వావసు నామ సంవత్సరం.. మిథున రాశివారికి అంతా అనుకూలమే..!
Ugadi Rasi Phalau 2025 | మిథున రాశి( Gemini Astrology )వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరంలో అధిక భాగం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.

Ugadi Rasi Phalau 2025 | మిథున రాశి( Gemini Astrology )వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరంలో అధిక భాగం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.
తెలుగు సంవత్సరం ప్రారంభం నుండి 15 మే 2025 వరకు అనుకూల కాలం కాదు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలు, ఆర్ధిక పురోగతికి సంబందించిన విషయాలలో అనుకూలత ఉండదు. అదృష్టం అంతగా కలసి రాదు. కుటుంబ పరమైన మరియు ధార్మిక పరమైన విషయాలకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. గంగా స్నాన సమానమైన పుణ్య ఫలం సంపాదించగలుగుతారు.
16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు గురు గ్రహ అనుకూల దృష్టి సంపూర్ణంగా లభిస్తుంది. అవివాహితులకు, సంతాన ప్రయత్నాలు చేయువారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మిక్కిలి రూపవంతులైన, సద్గుణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించుటకు అవకాశములు పుష్కలంగా ఉన్నవి. పురుషులకు దేహ ధారుడ్యత పెరుగుతుంది. మంచి ఆహార నియమాల పట్ల దృష్టి పెడతారు. అన్ని విధాలా సంతృప్తికరమైన యోగ్యమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు.
20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురు గ్రహం వలన అతి చక్కటి ఆర్ధిక సౌఖ్యం అనుభవిస్తారు. పెట్టుకున్న ఆర్ధిక లక్ష్యాలను చేరుకుంటారు. నిలువ ధనం చేతిలో ఉంటుంది. కానీ ఈ కాలంలో అనారోగ్యత భాదిస్తుంది. ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు ఈ కాలంలో ఆరోగ్య పరంగా జాగ్రత్త వహించాలి.
6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు గురు గ్రహ పరంగా తిరిగి అత్యంత అనుకూల కాలం అనుభవిస్తారు. సంఘంలో మిక్కిలి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలరు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గురు గ్రహ అనుకూలత సంపూర్ణంగా ఉంటుంది.
మిథునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. వారసత్వ సంపద విషయాలలో లాభ పడతారు. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ సంపూర్ణ బలం కలిగి ఉన్నవారు ప్రభుత్వ పరమైన లాభములను ఈ సంవత్సరం అధికంగా పొందుతారు. నిత్యం పూజాది క్రతువులు నిర్వహించే వారికి ఈ సంవత్సరం అంతా ఆచారం పాటించడానికి కావలసినటువంటి సమయం లభించదు. ఆచారం స్వల్పం అగును. సరిపడినంత సమయాన్ని దైవ ఆరాధనకు కేటాయించలేరు. మిథునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
మిథునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు. 18 మే 2025 వరకు కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆ తదుపరి రాహువు వలన అనుకూల ఫలితాలు పొందలేరు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, మాతా పితృ వర్గీయుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలుగచేస్తాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాహు గ్రహ శాంతులు అవసరం.
మిథునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా 19 మే 2025 నుండి భూ సంబంధ క్రయ విక్రయాలు లాభకరంగా ఉంటాయి. సొంత గృహ సౌఖ్యం ఏర్పాటు చేసుకోగలగుతారు. వ్యవసాయ ఆధారిత రంగం వారికి బాగా కలసి వస్తుంది. ఆశించిన విధంగా చేతి పై ధనం నిలువ ఉంటుంది.