Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వ్యాపారంలో లాభాల పంట‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వ్యాపారంలో లాభాల పంట‌..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సంతోషకరమైన అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడం సంతోషం కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో సరైన ప్రణాళికతో ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి లాభాల పంట పండుతుంది. ఇంటికి బంధువుల రాకతో సందడి నెలకొంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇప్పటివరకు ఉన్న ప్రతికూల ఆలోచనలు, అపనమ్మకాలు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాలలో బాధ్యతాయుతంగా ఉండడం అవసరం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. చేపట్టిన పనుల్లో ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తే విజయాలు సొంతమవుతాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఇంటా బయట ఉద్రిక్త పూరిత వాతావరణం ఉంటుంది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టం ఉండవచ్చు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. రుణభారం తగ్గుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు సునాయాసంగా అధిగమిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే ఆశించిన విజయాలు అందుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలతో అధిగమిస్తారు. లక్షసాధనలో ముందంజ వేస్తారు. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చి పెడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మద్దు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం, అధికారుల మద్దతు ఉంటాయి. మొహమాటంతో సమస్యల్లో చిక్కుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఉండవచ్చు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనధాన్య లాభాలున్నాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ముందుచూపుతో వ్యవహరిసే ఖర్చులు అదుపులో ఉంటాయి.