మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రతతో లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. నూతన ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు సఫలం అవుతాయి. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహకారంతో ఉద్యోగంలో కీలక విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ మంచితనం, సత్ప్రవర్తనతో శత్రువులు కూడా మిత్రులవుతారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సౌభాగ్యసిద్ధితో శుభయోగాలు చేకూరుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. బుద్ధిబలంతో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కరిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకంగా మారుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో రాజయోగం సిద్ధిస్తుంది. అధికార యోగం బలంగా ఉంది. కీలక బాధ్యతలు చేపడతారు. ప్రారంభించిన ప్రతి పనిలోనూ అనుకూలత ఉంటుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు పొందాలంటే మరింత శ్రద్ధగా పని చేయాలి. అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిది. వ్యాపారంలో సహనంతో ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ కర్తవ్యాలు సక్రమంగా నెరవేర్చి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు, గౌరవం పొందుతారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో అధికారులతో అనుగుణంగా నడుచుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారంలో విశ్వసనీయతతో కృషి చేస్తే లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సంబంధిత విషయాల్లో ఆచి తూచి అడుగేయాలి. సన్నిహితులతో విభేదాలు రాకుండా చూసుకోండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో దృఢ సంకల్పంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు పొందవచ్చు. వ్యాపారంలో సానుకూల ఆలోచనలు విజయానికి కారణమవుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. బంధుప్రీతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త అందుకుంటారు. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. డబ్బుకు లోటుండదు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు గౌరవం పెరుగుతాయి.