Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగ‌, వ్యాపారాల్లో శుభ‌యోగాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 13, 2025 6:54 AM IST
Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగ‌, వ్యాపారాల్లో శుభ‌యోగాలు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల ఇంట్లో జరిగే శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. విందు వినోదాలతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో హోదా పెరగడంతో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తెలివితేలతో, బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికంగా అత్యంత ఫలదాయకమైన రోజు. విశేషమైన ధనయోగం ఉంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి నిపుణులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన రోజు. వ్యాపారులు ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందవచ్చు. ఉద్యోగంలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాలి. ధననష్టం సూచన ఉంది కాబట్టి ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా బాధ పడతారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం మెండుగా ఉంటుంది. ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయానికి పనులు ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభసమయం కొనసాగుతోంది. ఆర్థికస్థితి బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ యోగాలున్నాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మనోబలంతో కృషి చేస్తే సమస్యలు తొలగుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. డబ్బు ఆచితూచి ఖర్చు చేయండి. వ్యాపారులు రుణభారం పెరగకుండా జాగ్రత్త వహించాలి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప సంకల్పబలం, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా శ్రేయోదాయకమైన సమయం. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆదాయమార్గాలు విస్తరిస్తాయి. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించండి. మీలోని నైపుణ్యాలను వెలికి తీయండి. ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి.