15.05.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 15, 2024 / 07:03 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోడానికి కొత్త మార్గాలు వెదుకుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రోజంతా తీరిక లేని పనులతో ఖాళీ ఉండదు. విజయ సిద్ధి ఉంది. మీ ప్రతిభ పని తీరుపై అధికారులు గుర్తించి ప్రోత్సహిస్తారు. ఆర్ధిక లాభాలుంటాయి.

మిథునం

మిధున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుద్ధి బలంతో పని చేసి విజయాన్ని సాధిస్తారు. మీ ప్రతిభకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధిక ప్రయోజనాలుంటాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఉండేవారికి శుభకరంగా ఉంటుంది. మీరు ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. ఇంటా బయటా, ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరిస్తే మేలు. పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం, సమర్థత మీ విజయానికి బాటలు వేస్తుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. మీరు ఎంత శ్రమిస్తే అంతగా విజయం, ధనలాభం ఉంటాయి. నిస్వార్ధంతో మీరు చేసే పనులు సంఘంలో మీకు గొప్ప పేరును తీసుకు వస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. మనోధైర్యంతో పనిచేసి విజయాలను సాధిస్తారు. మీ ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి ఉంటుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు అందుకుంటారు. మంచి ఆరోగ్యం, ఒక శుభవార్త మంచి శక్తిని ఇస్తుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మకరం

మకర రాశి వారికి గొప్ప శుభ సమయం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. పలు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. ఖర్చులు పెరుగుతాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి లాభాలను అందుకుంటారు. సేవా రంగంలో పని చేసే వారికి విశేష ప్రయోజనాలు ఉంటాయి. జీతాలు పెరుగుతాయి. పదోన్నతులు వస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు మంచి రోజు. ఉద్యోగస్తులకు పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. ఆరోగ్యం సహకరించదు.

Latest News