Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. శుభకార్యాల్లో మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూలంగా ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన అనేక సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. పెట్టుబడులపై లాభాలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక బలం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. మీ వృత్తిజీవితం ఓ కీలక ఘట్టానికి చేరుతుంది. బదిలీ, ప్రమోషన్, జీతం పెంపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. వ్యాపారంలో ఆటంకాలు అధిగమిస్తారు. ధనప్రవాహం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత ఉండేలా చూసుకోండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభసమయం నడుస్తోంది. బంగారు భవిష్యత్తు ఆహ్వానం పలుకుతోంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో మీరు కలలు కన్న స్థాయికి చేరుకుంటారు. మనఃసౌఖ్యం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆశించిన ధనలాభాలు అందుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉంటే మంచిది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో తీవ్రమైన జాప్యం ఉండవచ్చు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పుతో సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల మాటకు విలువ ఇవ్వడం మంచిది. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరించండి. ప్రతికూల ఆలోచనలు విడిచి పెడితే మంచిది. కోపం అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు పెరగవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram