చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు ఆనందమయంగా గడుస్తుంది. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థిక లాభం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు అన్నింటా విజేతలుగా నిలుస్తారు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచనలున్నాయి. విద్యార్థులకు కష్ట కాలం అని చెప్పవచ్చు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యక్తిగత జీవితంలోని సమస్యల ప్రభావం వృత్తిపై పడకుండా చూసుకోండి. అనుకోని ఖర్చులు ఉంటాయి. మీ వైఖరి పట్ల మీ కుటుంబ సభ్యులు ఉద్రేకంగా ఉన్నారు. సహనం వహించండిఆదాయం సామాన్యంగా ఉంటుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాలవారు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తారు. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేరు. కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు జరగవచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా కొంత పరవాలేదు. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిలో అనుకూలత లోపిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిస్తారు. అనవసర ఖర్చులు ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కీలక విషయాల్లో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు కోర్టు వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులతో అనవసర వాదనలు మానుకోండి. వ్యాపారులకు మంచి లాభాలున్నాయి. సన్నిహితులతో కలిసి పర్యటనలు చేస్తారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పని విజయవంతం అవుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మకరం
ఈ రోజు మకర రాశి వారికి మంచి ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు మొదలుపెట్టడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. ఇది మీకు అదృష్టంగా పరిణమిస్తుంది. దేవాలయ దర్శనానికీ, తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. విదేశాల్లో నివసించే బంధువుల నించి శుభవార్త వింటారు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మీకు అంతటా విజయమే. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ప్రేమపూరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడి సానుకూల వైఖరితో ఉండగలిగితే ఈ రోజు మీకొక సువర్ణావకాశం. అనవసర వాదనలకు తావివ్వకండి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులకు వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల లాభం పొందుతారు.