Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంగారం లాంటి భవిష్యత్..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెట్టినా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. ప్రారంభించిన ప్రతి పనిలోనూ పురోగతి సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగిన మనోబలంతో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు, అధికారులతో ఒత్తిడి ఉండవచ్చు. సహనంతో ఉండడం అవసరం. శత్రు భయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు శుభ ప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా అద్భుతమైన అవకాశాలు ఎదురవుతాయి. ముఖ్యమైన సమావేశాలు, చర్చలు ఫలవంతం అవుతాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వీడద్దు. చేపట్టిన పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. మీ మాట తీరుతో బంధువులతో, కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తు ఎదురు చూస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆటంకాలు అధిగమించి విజయమార్గంలో పయనిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విజయాలు మనోబలాన్ని పెంచుతాయి. రుణ సమస్యలు తగ్గుతాయి. కోపాన్ని తగ్గించుకుంటే కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా కొన్ని కఠినమైన సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సమయాన్ని వృథా చేయవద్దు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఉండవచ్చు. ఓర్పుతో సమస్యలు అధిగమించవచ్చు. డబ్బు వృథా చేయవద్దు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన సమయం నడుస్తోంది. బుద్ధిబలంతో ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మనోధైర్యంతో లక్ష్యాలను చేరుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. భూ, గృహ, ధన లాభాలున్నాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఆందోళన కలిగించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో తప్పకుండా జాగ్రత్త పడండి.