Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 22, 2025 6:14 AM IST
Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాదనలు, చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ప్రతికూల ఆలోచనలను విడిచి పెట్టండి. ఆర్థికంగా ఈ రోజు చాలా కఠినంగా ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం చేసే కృషి ఫలిస్తుంది. వ్యాపారంలో ధనయోగం ఉంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. కొత్త పనులు మొదలు పెట్టడానికి అనువైన రోజు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. శుభకార్యాల్లో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీకటాక్షసిద్ధి ఉంటుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనిశ్చితి పరిస్థితులు నెలకొంటాయి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థిరమైన నిర్ణయాలతో సత్ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషం నింపుతుంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన కాలం నడుస్తోంది. ఏ పని ప్రారంభించినా సత్వర విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. దైవబలంతో కొన్ని సమస్యలు తొలగుతాయి. కీలక నిర్ణయాల విషయంలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించాలి. చంచల బుద్ధితో నష్టం కలగవచ్చు. నిరంతర కృషితో లక్ష్యాలను క్రమంగా చేరుకుంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దగా మార్పులు ఉండవు. ప్రారంభించిన పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. గ్రహబలం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏ పని తలపెట్టినా నిబద్దతతో పనిచేయడం అవసరం. ప్రణాళిక లోపంతో ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తిపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. శుభాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శాంత స్వభావంతో, వాక్చాతుర్యంతో శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థికపరంగా, వృత్తిపరంగా, అనేక లాభాలు, పదోన్నతులు లభిస్తాయి. వ్యక్తిగతంగా, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.