Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్రియ‌మైన వారితో మ‌నస్ప‌ర్థ‌లు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 23, 2025 6:00 AM IST
Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్రియ‌మైన వారితో మ‌నస్ప‌ర్థ‌లు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మనోధైర్యం పెంచే సంఘటనలు జరుగుతాయి. దైవానుగ్రహంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అద్భుతంగా పని చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. ముఖ్యమైన పనులు, కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్వర విజయాలను అందిస్తాయి. మీరు చేసే పరోపకార పనులు, సామాజిక సేవ కార్యక్రమాలు మీ ఖ్యాతిని పెంచుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ధనలాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరిగినప్పటికీ ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి. కవులు, రచయితలకు శుభ సమయం నడుస్తోంది. కొత్త అవకాశాలు అందుకుంటారు. సన్మాన సత్కారాలు పొందుతారు. ఆర్థికంగా మేలైన సమయం.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలం కాదు. కొన్ని సంఘటనలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ప్రియమైన వారితో మనస్పర్థలు అశాంతికి కారణమవుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుచూపు, ప్రణాళికతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ధనలాభాలు పెరిగినప్పటికీ ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో, సంబంధీకులతో స్వల్ప వివాదాలు ఉండవచ్చు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి పరమైన శుభవార్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శన ప్రశాంతతనిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి నిరాశ కలిగిస్తుంది. సామాజిక, ధార్మిక కార్యక్రమాలపై అధికంగా ఖర్చు చేస్తారు. మీ సంపద, ప్రతిష్టకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి. కీలక వ్యవహారాల్లో సందర్భానుసారం నడుచుకోవడం మంచిది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఉద్యోగులకు ఫలవంతమైన రోజు. పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికాంశాలు అనుకూలంగా ఉంటాయి. పేరుప్రతిష్టలు, ప్రజాదరణ పెరగవచ్చు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు వెంటనే అమలు చేయడం వల్ల లాభం పొందుతారు.