Today Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయాన్ని మించిన ఖ‌ర్చులు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Today Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయాన్ని మించిన ఖ‌ర్చులు..!

మేషం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు ఎదురైనా అధిగమిస్తారు. బలహీనతలను అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఖర్చులు పెరుగుతాయి.

వృషభం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. కాని మీ ప్రతిభతో వాటిని అధిగమిస్తారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. ఉద్యోగాలకు స్థానచలనం ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఓ వార్త మనస్తాపాన్ని కలిగిస్తుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారికి శ్రమతో కూడిన విజయం ఉంటుంది. పనిభారంతో అలసటగా ఉంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని ఘటనల కారణంగా వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సహనంతో ఉంటే మంచిది. ఉన్నతాధికారుల సహకారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ కలహాలు అశాంతికి కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కన్య

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఆర్ధిక పురోగతి ఉంటుంది. ఊహించని సంపద కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. ఇంట్లో, ఆఫీస్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు ఈ రోజే శుభకరంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకోని ఆటంకాలు, సవాళ్లు కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. మానసికంగా, శారీరకంగా అలసటకు గురి కావడంతో పనులల్లో ఆలస్యం చోటు చేసుకుంటుంది. అదనపు ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది.

ధనస్సు

ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సంఘటనలు, సవాళ్లతో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఈ రోజంతా తీరిక లేకుండా పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం.

మకరం

ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలత, అభివృద్ధి ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

అన్ని రంగాల వారికి ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు తమ తమ రంగాల్లో విజయాన్ని చూస్తారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఊహించని విధంగా సంపద పెరగడంతో ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. విద్యార్థులు విదేశాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. జీవితం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే విజయం మీదే. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.