శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా గొప్ప శుభ‌ఫ‌లితాలు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా గొప్ప శుభ‌ఫ‌లితాలు..!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సున్నితమైన కుటుంబ సమస్యల పట్ల అతిగా భావోద్వేగంతో స్పందిస్తారు. ఆస్తి, భూతగాదాల విషయంలో సందర్భానుసారం వ్యవహరిస్తే మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. ఈ రోజు ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయవద్దు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని రంగాల వారు ఓటములు, సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. దైవబలం అండగా ఉంది కాబట్టి సమస్య ఎంత పెద్దదైనా మీ సామర్ధ్యం, మీ శక్తియుక్తులతో అధిగమిస్తారు. తెలివిగా వ్యవహరించి ఓ ఆపద నుంచి బయట పడతారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మధుర జ్ఞాపకాల్లో మునిగిపోతారు. మేధోపరమైన చర్చలలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో ఈ రోజు ఉత్సాహంగా, సంతోషంతో ఉంటారు, ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు, అస్సైన్మెంట్లు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు ఆర్ధికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఈ రోజు ఊహకందని లాభాలను అందుకుంటారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. వినోదం కోసం అధిన ధనవ్యయం చేసే అవకాశం ఉంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతుల కోసం, వ్యాపారంలో పురోగతి కోసం ఎదురు చూసేవారి ఎదురుచూపులకు ముగింపు పలికే తరుణం వచ్చింది. ఈ రోజు మీకు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి కావడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పలు మార్గాల ద్వారా ఆదాయం పెరగడం సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. కుటుంబంతో మంచి సమయాన్ని గడిపితే ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆందోళనతో ఉంటారు. పనులు ఆలస్యం కావడం వల్ల నిరుత్సాహాంగా ఉంటారు. ఆర్ధికంగా కూడా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విహార యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఖర్చులు పట్ల అదుపు లేకపోతే ఆర్ధిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కుంభం

కుంభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆర్థికంగా, వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుంది. సేవా రంగంలో పని చేసే వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. జీతాలు పెరుగుతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు, వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి.