Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ప్రియమైన వారితో గొడవలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజంతా సుఖ శాంతిమయంగా గడుస్తుంది. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన అన్ని పనులు రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృ వర్గం నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా లాభ పడవచ్చు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సమస్యలు ఎదురుకావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తితో అన్ని సమస్యలు పరిష్కరించగలరు. ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. కుటుంబ కలహాల్లో మనోనిగ్రహం పాటించాలి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తోంది. ఆర్థికంగా శుభ సమయం. అనేక మార్గాల నుంచి ధనప్రవాహం ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సరైన ప్రణాళిక అవసరం. పెద్దల మార్గదర్శకత్వంలో ముందుకెళ్తే ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. లక్ష్యంపై నుంచి దృష్టి మళ్లకుండా జాగ్రత్త పడండి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. అధికారులతో ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు. అన్ని పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికం కావచ్చు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. తారాబలం అద్భుతంగా ఉన్నందున అన్నింటా విజయం ఉంటుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన చెడు గ్రహాల ప్రభావం తొలగింది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో కలుగుతున్న అపజయాలకు కృంగిపోవద్దు. కుటంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంతానం గురించి ఆందోళనతో ఉంటారు. ప్రయాణాలు అనుకూలం కాదు. వాయిదా వేసుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా కాదు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మానసిక వేదనకు గురవుతారు. కలహాలతో కల్లోలంగా ఉన్న కుటుంబ వాతావరణం మరింత ఆందోళన కలిగిస్తుంది. ప్రియమైన వారితో గొడవలతో మనశ్శాంతి కరువవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధిన శుభవార్తలు వింటారు. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. మంచి కాలం ముందునుండి. మీ ఆశయాలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. భూ, గృహ యోగాలున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో అవరోధాలు అధిగమిస్తారు. వృత్తి పరమైన చర్చలలో సంయమనం పాటించాలి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు అదుపులో పెట్టుకోండి. బంధువులతో అభిప్రాయ భేదాలు నెలకొనే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram