చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
మిథునం
మిథునస రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని పట్ల ఏకాగ్రతతో ఉండడం అవసరం. మీకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో పూర్తి చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్ధిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటే మేలు. అనారోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా అశాంతిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలహాలు ఉండవచ్చు. వ్యాపారులకు భాగస్వాములతో తగాదాలు ఏర్పడుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కన్య
కన్య రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. గృహంలో శాంతి సమన్వయ ధోరణి ఉంటాయి. వ్యాపారులకు లాభం, పరపతి పెరుగుతాయి. అన్ని రంగాల వారు ఈ రోజు గొప్ప శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది.
తుల
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగులు పనిలో నిర్లక్ష్యం కారణంగా పై అధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా లేదు. మీ కోపం కారణంగా ఇంట్లో కలహాలు రావచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో అభిప్రాయం భేదాలు రావచ్చు. మీరు మౌనంగా శాంతంగా ఉండడమే సమస్యకు పరిష్కారం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన నష్టం, పరువు నష్టం సూచనలు ఉన్నాయి.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి మీకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. నూతన ప్రాజెక్టులు చేపట్టడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు విశేష శుభ ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు పది రెట్లు లాభాలను తెచ్చి పెడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రతి పనిలోను విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆర్ధికపరంగా గొప్పగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటాయి. సన్నిహితులతో విలువైన సమయంను గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగులు వ్యక్తిగత సమస్యల కారణంగా పనిపై దృష్టి సారించలేక పోతారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ధన నష్టం సూచితం.