బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో కలహాలకు ఆస్కారం..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల కారణంగా ఆందోళనలో ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల విశ్రాంతి లేమి, అలసట, బద్ధకం ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు లేకపోవడం వల్ల ఈ రోజంతా ఉద్రిక్త స్వభావంతోనే ఉండవచ్చు. పనిలో నిర్లక్ష్య వైఖరి కూడదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరగడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ధ్యానం చేస్తూ ప్రశాంతతను అలవరచుకుంటే ఒత్తిడిని అధిగమించవచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. కొత్త పనులు ప్రారంభించవద్దు.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడం, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరగడం మీ బంధువులలో మిమ్మల్ని ఉన్నతంగా ఉంచుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపారపరంగా చాలా అదృష్టమైన రోజు. ఉద్యోగులకు స్నేహితుల నుంచి సహోద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకతతో విన్నూత్నంగా ఆలోచించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని ముఖ్యమైన పనుల మీద దృష్టి సారిస్తే మంచిది. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా చెప్పుకోతగ్గ మార్పులేమీ ఉండవు. సోమరితనం, బద్దకం కారణంగా ఏ పనులు సమయానికి పూర్తి చేయలేక పోతారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమర్ధత లోపిస్తుంది. జీవితభాగస్వామితో కలహాలకు ఆస్కారముంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా గొప్ప శుభఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి పరంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు. చేపట్టిన అన్ని పనుల్లో విజయం మీదే! ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసరపు ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాలి. ఇతరులతో మాట్లాడే తీరు మర్యాదగా ఉండేలా జాగ్రత్త వహించండి. ధార్మిక కార్యకమాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనులను మీదైన శైలిలో ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. ఆదాయం పెరగడంతో ఉల్లాసభరితంగా, సంతోషకరమైన అనుభూతి చెందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారు చేసే ప్రతి పనిలోనూ ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదముంది. కుటుంబ సభ్యులతో, బంధువులతో కలహాలు మనస్తాపం కలిగిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు త్వరలో శుభవార్తలు వింటారు.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. మీ పై అధికారుల మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది.