Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్థికంగా ఊహించని శుభ ఫలితాలుంటాయి. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు పరిష్కరించడం కొంత కఠినంగా ఉంటుంది. సానుకూల పరిస్థితులు ఏర్పడటానికి కొంత సమయం పడుతుంది. నిరాశ చెందకండి. కఠిన శ్రమ, సహనం ఫలితాన్ని ఇస్తుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే వృత్తిపరమైన ఆటంకాలు దూరమవుతాయి. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. శత్రువులను తక్కువ అంచనా వేయద్దు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. తెలివైన నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థికంగా శుభకాలం.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విషయాలకు దూరంగా ఉండండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతతో చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభం ఉంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో పురోగతికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన నిర్ణయాల్లో బాధ్యతాయుతంగా నడుచుకుంటే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు తక్కువ ప్రయత్నంతోనే విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందం నింపుతుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా మీ కృషికి తగిన ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఉద్యోగులకు తోటివారి సహకారం ఉంటుంది. అయితే అధికారులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో సమయపాలనతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొన్ని సమస్యలు చికాకు పెడతాయి. మొహమాటంతో ఖర్చులు పెరగవచ్చు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహబలం తక్కువగా ఉన్నందున చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం ఉండవచ్చు. కొన్ని అనుకోని సంఘటనలతో కలత చెందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆస్తి తగాదాలు సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి శుభ ఫలితాలుంటాయి. పెద్దల ఆశీర్వాదాలు అండగా ఉంటాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.