బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి పెళ్లి నిశ్చయం కావొచ్చు..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు గతంలో ఉన్న పెండింగు పనులన్నీ పూర్తి చేస్తారు. సంతానం అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు శుభసమయం నడుస్తోంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులు సృజనాత్మకంగా పనిచేసి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మీ పనితీరుకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా గొప్ప శుభఫలితాలు ఉంటాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడులు ఉన్నా అధిగమిస్తారు. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. కుటుంబ వ్యహారాల్లో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఉద్యోగంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. బంధు మిత్రులలో వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.
సింహం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్వశక్తిని నమ్ముకొని పనిచేస్తే విజయం మీదే. చేపట్టిన అన్ని పనులు విజయం చేకూరుస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి.
కన్య
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారు పని పట్ల శ్రద్ధ ఏకాగ్రత పెంచాలి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతల పట్ల దృష్టి సారిస్తారు. ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతిపనీ విజయవంతమవుతుంది. ఆదాయంలోనూ పెరుగుదల ఉండడం సంతృప్తి కలిగిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అమ్మకాలు, కొనుగోళ్లు జోరందుకుంటాయి. గణనీయమైన లాభాలను అందుకుంటారు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. చేసే పనిలో పురోగతి, లక్ష్మీకటాక్షం ఉంటాయి. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి.
ధనుస్సు
ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చిత్తశుద్ధితో, కష్టించి పనిచేస్తే తప్ప మంచి ఫలితాలు ఉండవు. ఉద్యోగులకు పనులు ఆలస్యమవుతాయి. సహనంతో ఉంటే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం వుంది.
మకరం
ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పనులు నెమ్మదిగా సాగుతాయి. సహనంతో ఉంటే మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఊహించని ఖర్చులు చుట్టుముడతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు విజయం, కీర్తి, వరిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగస్థులు తోటి ఉద్యోగుల సహకారంతో అన్ని పనులు వియజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఉండవచ్చు. అవసరానికి ధనం అందుతుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు.