Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ప్రియ‌మైన వారితో మ‌న‌స్ప‌ర్థ‌లు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 07, 2025 7:52 AM IST
Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ప్రియ‌మైన వారితో మ‌న‌స్ప‌ర్థ‌లు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు ఉండవచ్చు కాబట్టి అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. పనిపట్ల శ్రద్ధ లోపించకుండా జాగ్రత్త వహించాలి. ఆస్తులకు సంబంధించిన ఆందోళన అధికంగా ఉంటుంది. కుటుంబంలో స్వల్ప సమస్యలుంటాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. సంతోషం కలిగించే అనేక సంఘటనలు ఈ రోజు జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో విజయాన్ని అందుకుంటారు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో, ఆశావాద దృక్పథంతో లక్ష్యాలకు చేరువ అవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదాయ మార్గాలు వృద్ధి చెందడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభ యోగాలున్నాయి. వ్యాపార విస్తరణకు, నూతన పెట్టుబడులకు అనువైన సమయం. లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో పెను మార్పులు జరిగే అవకాశముంది. వ్యాపారులు ఈ రోజు తీవ్రమైన పోటీని చూడాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలు సంభవించే సూచనలున్నాయి. పెట్టుబడులు, స్పెక్యూలేషన్లకు ఈ రోజు తగిన రోజు కాదు. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సమస్యలు రావచ్చు. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. నూతన ఒప్పందాలు, ప్రాజెక్టులకు అనువైన సమయం. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉంటే మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబంలో సంతోషకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు సంతోషం కలిగిస్తాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. సరైన ప్రణాళికతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసి రావడం ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ ధోరణితో గృహ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. సమయపాలనతో చేపట్టిన పనులు పూర్తి చేస్తే మంచిది. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉండక పోవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అస్థిరమైన నిర్ణయాలతో ఇబ్బందులు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో ప్రతికూలతలు జరుగుతాయి. ప్రియమైనవారితో వివాదాలు, మనస్పర్థలకు అవకాశం ఉంది.