Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి కుటుంబ సభ్యులతో గొడవలు..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో చక్కని పురోగతి ఉంటుంది. మానసికంగా సంతోషంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణమవుతారు. ఆర్థిక పురోగతిని సాధిస్తారు.
వృషభం
ఈ రోజు శుభకరంగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులతో, బంధువులతో సరదాగా గడిచిపోతుంది. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి శుభవార్త అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అందరిని కలుపుకొని పోవడం మంచిది. సమష్టి నిర్ణయాలతో విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు చేటు తెస్తాయి. ఉద్యోగంలో సవాళ్లు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కర్కాటకం
ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజు శుభకరమైన రోజు కాదు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా మానసికంగా ఆందోళనకు గురవుతారు. ఉద్యోగంలో గత తప్పిదాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అదుపులేని కోపం కారణంగా కుటుంబ సభ్యులతో గొడవపడతారు. వ్యాపారంలో ధననష్టం సూచితం.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుటుంది.
కన్య
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి పట్ల కఠినం ఉంటే మంచిది. ఆర్థికంగా శుభసమయం. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిక్కచ్చిగా వ్యవహరించడం కొందరికి నచ్చక పోవచ్చు. మీ వైఖరిని విమర్శించే వాళ్ల గురించి పట్టించుకోవద్దు. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు మంచి జీతంలో ఉద్యోగప్రాప్తి ఉంది. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని మీ బలహీనత కారణంగా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కోపం నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సాధారణ అనారోగ్యం, బద్ధకం, ఒత్తిడి కారణంగా అన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. వ్యాపారులు వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో పెరుగుతున్న పోటీ, ఎదురవుతున్న సవాళ్లు మిమ్మల్ని ఈరోజు ప్రశాంతంగా ఉండనివ్వవు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. సంపద, సంతోషం సమృద్ధిగా లభిస్తాయి. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో అధికలాభాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కుంభం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం మీకు చాలా భారంగా మారుతుంది. సంతానానికి సంబంధిన సమస్యల కారణంగా ప్రశాంతత కోల్పోతారు. కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్నీ పనుల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సంయమనం పాటించండి. వీలైతే వాయిదా వేయండి. ఉద్యోగంలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.