Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో అదృష్టం వరిస్తుంది..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతానం పురోగతి సంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిజాయితీ, ఆత్మ విశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు తెలివిగా, జాగ్రత్తగా పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. పనిభారంతో ఒత్తిడికి లోనవుతారు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. చేపట్టిన ప్రతీ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక పని ఈ రోజు పూర్తవుతుంది. మొండితనం, ఉద్రేక స్వభావం వీడితే మంచిది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా, వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మంచి శుభ సమయం నడుస్తోంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబంతో సరదాగా గడుపుతారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అదృష్టం వరిస్తుంది. వ్యాపారులు కృషి పట్టుదలతో ముందుకెళ్తే ఆశించిన ప్రయోజనాలుంటాయి. వృత్తి పరంగా ఒక వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యగా అనిపించిన విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలు మోసపూరితంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. అనారోగ్య సమస్యలకు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. కోపం అదుపులో ఉంచుకోండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా ఈ రోజు అద్భుతాలు సృష్టిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి తారాబలం ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలి. గిట్టనివారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.