Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి వ్యాపారంలో విశేష లాభాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 28, 2025 8:00 AM IST
Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి వ్యాపారంలో విశేష లాభాలు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ యోగాలున్నాయి. ప్రారంభించిన పనులు రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తారు. వృత్తి పరమైన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బలమైన యోగంవుంది. మానసికంగా ఈ రోజు చాలా శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఏర్పడిన సమస్యలతో విచారంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారంలో మెరుగైన పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి, ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండండి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి స్ఫష్టంగా గోచరిస్తోంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బలమైన ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని తృప్తిగా, ఆనందంగా ఉంచుతాయి. కళాకారులకు అనువైన సమయం.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గిట్టని వారి వల్ల చేపట్టిన పనుల్లో ఆటకంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణుల సలహాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులు రుణభారం పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలు విశేషంగా ఉంటాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. ఒక తీర్థయాత్రకు అవకాశం ఉంది.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పరోపకార పనులతో సమాజంలో విశేషమైన ప్రజాదరణ, పరపతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారం, గౌరవం పెరుగుతాయి. నూతన వాహన యోగం ఉంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధికి కాలం అనుకూలంగా ఉంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నతస్థితి, ప్రసంశలు లభిస్తాయి. వ్యాపారంలో ధనయోగాలున్నాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మనోధైర్యంతో ముందడుగు వేసి సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ధనయోగం బలంగా ఉంది. వృథా ఖర్చులు నివారించండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి. అస్థిరమైన కుటుంబ వాతావరణం, కుటుంబ కలహాలు ఆందోళన కలిగిస్తాయి. ఒక వ్యవహారంలో ఆర్థిక నష్టం కలగవచ్చు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సన్నిహతుల సహకారం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. గిట్టనివారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో, బుద్ధిబలంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ఆర్థిక సమస్యలు తొలగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. సన్నిహితులతో, మిత్రులతో సుదూర ప్రయాణాలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్ధిక లాభాలకు అవకాశం ఉంది.