20 జులై 2024.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిభారం పెరుగుతుంది. తీరికలేని పనుల కారణంగా అలసటగా ఉండవచ్చు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆందోళనతో ఉంటారు. ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా నష్టపోతారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి గొప్ప విజయాలు ఉంటాయి. వ్యాపారులకు వ్యాపారంలో అభివృద్ధి, లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. స్థిరాస్తి రంగం వారికి పట్టింది బంగారం అవుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అదృష్ట యోగాలు ఉంటాయి. సహోద్యోగులు నుంచి సహకారాలు అందుతాయి. మీ పై అధికారి మీ పనికి సంతృప్తి చెందుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగులకు చేసే పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకెళ్తే విజయం వరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు వ్యక్తిగత సమస్యల కారణంగా పనిపై దృష్టి సారించలేక పోతారు. ధన నష్టం సూచితం. కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. రక్తసంబంధీకులతో అనుబంధాలు దృఢ పడతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి శుభకరంగా ఉంది. పెట్టిన పెట్టుబడులకు పదింతలు లాభాలు అందుకుంటారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఈ రోజు మీ మాటలు అదుపులో ఉంచుకోండి. లేకుంటే కుటుంబ వ్యవహారాల్లో గొడవలు జరిగే అవకాశం వుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండక పోవచ్చు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పనులన్నీ సకాలంలో పూర్తి చేసి ప్రమోషన్ అందుకుంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో భారీ నష్టాలూ ఉండవచ్చు. ఈ కారణంగా విచారంగా ఉంటారు. ధనవ్యయం చేస్తారు. ఈ రోజు మీ సంపదకు, ప్రతిష్ఠకు భంగం కలిగే సూచనలు ఉన్నాయి.
కుంభం
ఈ రోజు అనుకూలమైన రోజు. గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో వ్యాపారాన్ని విసరిస్తారు. పెట్టుబడుల పైన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా చాలా అద్బుతమైన రోజు. మీ పనికి తగిన గుర్తింపు వస్తుంది. పై అధికారులు మీ పనితీరుకి తృప్తి చెందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం సంతోషాన్ని కలిగిస్తుంది.