Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి గొప్ప శుభ స‌మ‌యం న‌డుస్తోంది..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి గొప్ప శుభ స‌మ‌యం న‌డుస్తోంది..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి పరమైన శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్య సాధన నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరు వ్యక్తులు ఇబ్బంది కలిగించవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శత్రు భయం పొంచి ఉంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు ఇబ్బంది పెడతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి, సందిగ్ధావస్థ నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో వాదనలు పెంచుకుంటే విచారం తప్పదు. ప్రయాణం వాయిదా వెయ్యండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు చేసుకుంటారు. బంధు మిత్రులను కలుసుకోవడం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. మీ అదృష్టాన్ని మీరే నమ్మలేకపోతారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్పష్టమైన ఆలోచనతో, దృఢ నిశ్చయంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించండి. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలు సునాయాసంగా పరిష్కరిస్తారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కీలక సమావేశాలలో మీ మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అంత అనుకూలం కాదు. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వ్యాపారులు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా గొప్ప శుభసమయం. ఊహించని ధనలాభాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. మంచి మనసుతో చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి. ఒక సంఘటన మీ మనోబలాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచన ఉంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం చోటుచేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. వ్యాపార లావాదేవీలు, మేదోపరమైన విషయాలకు అనుకూలమైన సమయం. మీ ఆలోచనలు ఇతరులకు ఆదర్శంగా ఉంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు ఒత్తిడి వుండే అవకాశం వుంది. అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కోపం, చిరాకు అదుపులో ఉంచుకుని మౌనంగా వుండడం మంచిది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్ధికంగా కలిసి వస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో ఆటంకాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో జాగ్రత్తగా నడుచుకోవాలి. అపార్ధాలు, వివాదాలకు తావు లేకుండా చూసుకోండి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృధా ఖర్చులు నివారించండి.