Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Mar 20, 2026 7:26 AM IST
Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

మేషం

ఈ రోజు మీకు శుభవార్తల సందడి ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి మంగళకార్యాల ఆహ్వానాలు అందుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనలాభం కలగవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది.

వృషభం

కుటుంబంలో ఆరోగ్య సంబంధిత విషయాలు కొంత ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. పనిలో శ్రమ పెరుగుతుందే తప్ప ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. కొత్తగా అప్పులు చేయాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మిధునం

ఎక్కువ శ్రమ పెట్టినా ఫలితాలు తక్కువగా అనిపించే రోజు. బంధువులతో ముఖ్యంగా ఆస్తి విషయాల్లో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. అయితే కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశం కలుగుతుంది.

కర్కాటకం

ఇటీవల ఉన్న పని ఒత్తిడి నుంచి కొంత రిలీఫ్‌ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దర్శనమిస్తాయి.

సింహం

ముఖ్యమైన నిర్ణయాలు కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో నెమ్మదితనం కనిపిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. సోదరులతో ఆస్తి విషయాల్లో తగాదాలు రావచ్చు. ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి కలిగిస్తుంది. కళ్లకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ వహించాలి.

కన్య

ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. నిరుద్యోగులు మంచి వార్తలు వినే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు లభించే సూచనలున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. పాత బాకీలు తీర్చే పరిస్థితి ఏర్పడుతుంది.

తుల

ఇంటి నిర్మాణం లేదా గృహ సంబంధిత పనులు వాయిదా పడవచ్చు. ఇంటా బయటా కొంత టెన్షన్‌ వాతావరణం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

వృశ్చికం

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు అనుకూలంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. ఆప్తుల నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి. మీరు ప్రారంభించిన పనుల్లో విజయ సంకేతాలు కనిపిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహకర పరిస్థితులు నెలకొంటాయి.

ధనస్సు

చాలాకాలంగా నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో సంతోషకర సమయం గడుపుతారు.

మకరం

మాటలలో జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ క్రమంగా పూర్తి చేస్తారు.

కుంభం

ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు.

మీనం

ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రణాళికలు అమలులోకి వస్తాయి. వ్యాపార విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటే మేలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశం ఉంది.