Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అపార్థాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Mar 22, 2026 5:34 AM IST
Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అపార్థాలు..!

మేషం

ఈ రోజు కొంత ప్రతికూలత ఎక్కువగా అనిపించవచ్చు. ఆదాయం తక్కువగా ఉండగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు ఇబ్బందులు కలిగించవచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

వృషభం

ఆర్థికంగా ఊరట లభించే రోజు. అప్పులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో అకస్మాత్తుగా విజయం దక్కుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. పాత మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో లాభదాయక మార్పులు కనిపిస్తాయి.

మిధునం

చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన సమాచారం తెలుసుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త ప్లాన్లు అమలు చేయడానికి ఇది మంచి సమయం.

కర్కాటకం

దూర ప్రయాణాలను కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిది. అనుకోని వార్తలు కొంత ఆందోళన కలిగించవచ్చు. పనులు ఆలస్యంగా సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరిగి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో నెమ్మదితనం ఉంటుంది. అయితే ఓర్పు అవసరం.

సింహం

ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం, ముఖ్యంగా వాహన ప్రయాణాలు. కుటుంబంలో కొంత మార్పు గమనిస్తారు. అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి తక్కువగా ఉంటుంది.

కన్య

ఈ రోజు మీకు స‌ర్‌ప్రైజ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఆప్తుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. అవసర సమయంలో ఆర్థిక సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాలు మీ పనులను వేగంగా పూర్తి చేయిస్తాయి. వ్యాపార విస్తరణలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

తుల

సోదరుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు యత్నాలు విజయవంతమవుతాయి. దీర్ఘకాల సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయి. సమాజంలో మీ పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

ఈ రోజు ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. ప్రయాణాలు ఆశించినంత సాఫీగా ఉండవు. బంధువులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనస్సు

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. ఆర్థికంగా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావు. ఇంట్లో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొని మానసిక శాంతి పొందుతారు. ఉద్యోగంలో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం మంచిది.

మకరం

బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. పిల్లల విద్య విషయంలో మంచి వార్తలు వినిపిస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.

కుంభం

సోదరుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగి ఒత్తిడి అనిపించవచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు రావచ్చు. జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది.

మీనం

ఉద్యోగంలో మార్పులు, పురోగతి కనిపిస్తాయి. పాత అప్పులు తీర్చగలుగుతారు. పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తి సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.