Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నతస్థానం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం
పనులు సాధారణంగా సాగుతాయి. ఆస్తి విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారంలో ఫలితాలు సాధారణంగా ఉంటాయి. ఖర్చులు, ఆదాయం మధ్య గందరగోళం ఉంటుంది.
వృషభం
పనులు వేగంగా పూర్తవుతాయి. సోదరులతో ఉన్న సమస్యలు సర్దుబాటు అవుతాయి. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార ప్రారంభానికి మార్గం సుగమం అవుతుంది.
మిధునం
మీ నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. పనిలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి
కర్కాటకం
మిత్రులతో మంచి సమయం గడుపుతారు. కుటుంబ పెద్దలతో చిన్న విభేదాలు రావచ్చు. పనులు ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉంటాయి.
సింహం
ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పనులు పూర్తవుతాయి కానీ ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో కొంత అసౌకర్యం అనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య
కొత్త వ్యాపారాలు లాభాలు ఇస్తాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి.
తుల
వాహన సంబంధిత సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో మీ అభిప్రాయాలకు అందరూ సహకరించకపోవచ్చు. ఉద్యోగంలో పని భారం ఉంటుంది.
వృశ్చికం
శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆసక్తికర సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి.
ధనస్సు
శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి.
మకరం
ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
కుంభం
కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది.
మీనం
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో నెమ్మదితనం ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram