నరసన్న దర్శనానికన్నా.. ఎండలెక్కువనా ?.. యాదాద్రికి పొటెత్తిన భక్తజనం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఒకవైపు మండుతున్న ఎండలు..మరోవైపు భారీగా క్యూలైన్లలో రద్ధీ..అయినా లెక్క చేయకుండా బారులు తీరి స్వామివారి దర్శనం కోసం
విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఒకవైపు మండుతున్న ఎండలు..మరోవైపు భారీగా క్యూలైన్లలో రద్ధీ..అయినా లెక్క చేయకుండా బారులు తీరి స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించిన భక్తజనం తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మహాదానందం పొందారు. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు సాగుతున్న క్రమంలో యాదాద్రి దేవస్థానం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది.
కొండ పరిసరాలు..ఆలయ ప్రాంగణం భక్తుల రద్ధీతో సందడిగా కనిపించింది. సాధారణ క్యూలైన్లలో రెండు నుంచి మూడు గంటల పాటు..ప్రత్యేక దర్శనం లైన్లలో గంటన్నరకు పైగా భక్తులు వేచివుండాల్సివచ్చింది. భక్తుల వసతులపై ఆలయ ఈవో భాస్కర్‌రావు పర్యవేక్షణ చేశారు. ఎన్నికల అధికారి ఐఏఎస్ విజయ్, తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram