ఈ తేదీల్లో జ‌న్మించిన వారికి.. వివాహేత‌ర సంబంధాలు ఎక్కువేన‌ట‌..!

చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమ‌రాల‌జీని ఫాలో అవుతుంటారు. రాశిఫ‌లాలు చూడ‌నిదే ఆ రోజు ఏ ప‌ని ప్రారంభించ‌రు. జ్యోతిష్య శాస్త్ర ప్ర‌కార‌మే అన్ని ప‌నులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అదే స్థాయిలో న్యూమ‌రాల‌జీని కూడా న‌మ్ముతుంటారు. న్యూమ‌రాల‌జీ ద్వారా వ్య‌క్తిగ‌త జీవితంలో ముందే జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను ప‌సిగొట్టొచ్చు.

  • Publish Date - May 15, 2024 / 07:49 AM IST

చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమ‌రాల‌జీని ఫాలో అవుతుంటారు. రాశిఫ‌లాలు చూడ‌నిదే ఆ రోజు ఏ ప‌ని ప్రారంభించ‌రు. జ్యోతిష్య శాస్త్ర ప్ర‌కార‌మే అన్ని ప‌నులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అదే స్థాయిలో న్యూమ‌రాల‌జీని కూడా న‌మ్ముతుంటారు. న్యూమ‌రాల‌జీ ద్వారా వ్య‌క్తిగ‌త జీవితంలో ముందే జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను ప‌సిగొట్టొచ్చు. లెక్క‌ల‌తో ముడిప‌డే ఉండే జీవితాన్ని న్యూమ‌రాల‌జీతో మెరుగైన బాట‌లో ప‌య‌నించేలా చేసుకోవ‌చ్చు. అందుకే సంఖ్యాశాస్త్రం ప్ర‌కారం ఒక మ‌నిషి జీవితంలో ఏం జ‌రగ‌బోతుందో ఊహించొచ్చు. అయితే ప్ర‌ధానంగా ఈ తేదీల్లో జ‌న్మించిన వారికి జీవితంలో వివాహేత‌ర సంబంధాలు అధికంగా ఉంటాయ‌ని న్యూమ‌రాల‌జీ శాస్త్రం చెబుతోంది.

6, 15, 24వ తేదీలు..

ఏదైనా నెల‌లో 6, 15, 24వ తేదీల్లో జ‌న్మించిన వారు త‌న జీవిత భాగ‌స్వామితో ఎంతో ప్రేమ‌తో ఉన్న‌ట్టు న‌టిస్తుంటారు. లైఫ్ పార్ట్‌న‌ర్‌తో మాన‌సికంగా, శార‌రీకంగా సంతృప్తి చెంద‌డం లేద‌ని భావిస్తుంటారు. దీంతో వారిని మోసం చేసి వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు మోసం చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. కావున వీరి పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

3, 12, 21, 30వ తేదీలు..

ఏదైనా నెల‌లో 3, 14, 21, 30వ తేదీల్లో పుట్టిన వారు ఎంతో రొమాంటిక్‌గా ఉంటారు. ఈ రొమాంటిక్ మ‌న‌స్త‌త్వం వివాహేత‌ర సంబంధాల‌కు దారి తీస్తుంది. అలాగే వీరు తమ జీవిత భాగస్వామితో తరచూ అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

5, 14, 23వ తేదీలు..

ఏదైనా నెల‌లో 5, 14, 23వ తేదీల్లో జ‌న్మించిన వ్య‌క్తులు కొత్త‌ద‌నం కోసం, సంతృప్తి కోసం ఇత‌రుల‌తో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వ్య‌క్తులు త‌ర‌చుగా సాహ‌సోపేత‌మైన వైఖ‌రిని క‌లిగి ఉంటారు. జీవిత భాగ‌స్వామికి ఏ మాత్రం భ‌య‌ప‌డ‌రు.

8, 17, 26వ తేదీలు..

8, 17, 26 తేదీల్లో జ‌న్మించిన వారు విజ‌యం, అధికారం కోసం ప్ర‌యత్నిస్తుంటారు. ఈ ప్ర‌య‌త్నాలు నెర‌వేర్చుకునేందుకు అవ‌స‌ర‌మైతే వివాహేర‌త సంబంధాల‌కు కూడా వెనుకాడ‌రు. ఏ మాత్రం సంకోచించ‌కుండా ముంద‌డుగు వేస్తారు. తమ విజయం కోసం జీవిత భాగస్వామిని మోసం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు.

9, 18, 27వ తేదీలు..

ఏదైనా నెల‌లో 9, 18, 27 తేదీల్లో జ‌న్మించిన వ్య‌క్తులు త‌మ జీవిత భాగ‌స్వామిని కాద‌ని ఇత‌రుల‌తో ఎక్కువ‌గా చ‌నువుగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను కాదనలేక వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు బలహీనులు అవుతారు.

Latest News